వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఇటీవల ఏపీలో వరుసగా కేసులు బుక్ అవుతున్నాయి. గతంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ ఫోటోలను మార్ఫింగ్ చేయడంతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడులో టీడీపీ నేత రామలింగం ఫిర్యాదు చేశారు. ఆ మేరకు హైదరాబాద్‌లోని వర్మ నివాసానికి వెళ్లి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చి వచ్చారు ప్రకాశం పోలీసులు.