దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ట్రిపుల్ ఆర్’ ను వరల్డ్ వైడ్ గా పంపిణీ చేసే విషయంలో ఎవరెవరి పాత్ర ఏమిటనే విషయంలో కొంత క్లారిటీ వచ్చింది. దక్షిణాది భాషల థియేట్రికల్ రిలీజ్ విషయంలో దర్శక నిర్మాతలు ఇంకా గోప్యత పాటిస్తున్నా, ఈ సినిమాను హిందీలో పంపిణీ చేస్తున్న పెన్ స్టూడియోస్, పెన్ మరుధర్ సినీ ఎంటర్ టైన్ మెంట్స్ మాత్రం ఓ స్పష్టతను ఇచ్చేశాయి. పాన్ ఇండియా…
మెగాస్టార్ చిరంజీవి, కాజల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో ఈ భారీ బడ్జెట్ క్రేజీ ప్రాజెక్ట్ ను రామ్ చరణ్ తో కలిసి నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. కాగా ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే సైతం కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో చిరు, చరణ్ ఇద్దరూ నక్సలైట్లుగా కనిపిస్తారు.…
సెన్సేషన్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో సినిమా రానున్న విషయం తెలిసిందే. ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. రాజకీయ నేపథ్యంలో రామ్ చరణ్- శంకర్ సినిమా ఉంటుందని ప్రచారం నడుస్తుంది. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ సినిమాపై పలు రూమర్లు చక్కర్లు కొడుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం నాలుగు భాషల…
మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు కొరటాల కాంబినేషన్ లో ‘ఆచార్య’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, మెగా పవర్ స్టార్ చరణ్ సరసన పూజా హెగ్డే జోడీగా నటిస్తుంది. ఈ సినిమాలో ‘సిద్ధా’ పాత్రలో చరణ్ కనిపించనున్నారు. అయితే చరణ్ నిడివి ఉంటుందనీ, జస్ట్ గెస్ట్ రోల్ అనే టాక్ వచ్చింది. అయితే తాజాగా కొరటాల మాట్లాడుతూ.. ఈ సినిమాలో చరణ్ చేస్తున్నది గెస్ట్ రోల్ కాదని, ఆయన పాత్రకు…
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్ నటిస్తుండగా, అలియా భట్ రాంచరణ్ పక్కన నటిస్తోంది. కాగా అలియా ఈ సినిమాతో పాటుగా పలు బాలీవుడ్ చిత్రాలతోను బిజీగా వుంది. అయితే ఈ బ్యూటీ మరోసారి రాంచరణ్ సరసన నటించనున్నట్లు సమాచారం. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, రాంచరణ్ హీరోగా ఓ పాన్ ఇండియా…
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాతో బిజీగా ఉన్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ‘ఎస్ఎస్ఎంబి28’ వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్ ను ఇటీవలే ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే తాజాగా విన్పిస్తున్న టాక్ ప్రకారం త్రివిక్రమ్ ఈ సినిమా తరువాత మరో భారీ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.…
దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆక్సిజన్ కొరత ఆందోళన కలిగిస్తోంది. కరోనా బాధితుల అత్యధికులకు ఆక్సిజన్ అవసరమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రాణవాయువుకు విపరీతమైన డిమాండ్ ఏర్పడగా, గ్రీన్ కో సంస్థ చైనా నుంచి 1000 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను, పెద్ద సంఖ్యలో సిలిండర్లను తెప్పించి తెలంగాణ ప్రభుత్వానికి అందించింది. దీనిపై టాలీవుడ్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పందిస్తూ.. గ్రీన్ కో సంస్థకు అభినందనలు తెలిపారు. కరోనా కష్టకాలంలో తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా…
సినిమా కష్టాలు అంటే ఏమిటో సినిమా వాళ్లకే బాగా అనుభవంలోకి వస్తాయి. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ అదే పరిస్థితిలో ఉన్నారు. పైకి గంభీరంగా ఆయన కనిపిస్తున్నా, లోలోపల ఏ సినిమా ఎప్పుడు ఎలా పూర్తి చేయాలో తెలియక సతమతమౌతున్నారని తెలుస్తోంది. మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శంకర్… నిజంగా ఇన్ని వివాదాల్లో ఒకేసారి కూరుకుపోతారని కోలీవుడ్ లో ఎవరూ ఊహించలేదట. ఆయన దర్శకత్వంలో నటించడానికి స్టార్ హీరోలు సిద్ధంగా ఉన్నారు, అలానే కోట్లు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్న అల్లు అర్జున్ డాక్టర్ల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నాడు. తన అభిమానులు ఆందోళన పడకుండా ఎప్పటికప్పుడు తన హెల్త్ అప్డేట్స్ ను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కు స్టార్ కపుల్ ఉపాసన, రామ్ చరణ్ సర్ప్రైజ్ ఇచ్చారు. చరణ్, ఉపాసన కలిసి బన్నీ కోసం ఓ స్పెషల్ కిట్…
దర్శక ధీరడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్స్టార్ రామ్చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు కరోనా సెకండ్ వేవ్ కారణంగా బ్రేక్ పడింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజ్ అప్డేట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. జైలులో ఎన్టీఆర్, చరణ్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఉద్వేగానికి గురి చేస్తాయట. ఈ సన్నివేశం నేపథ్యంలో కాల భైరవ పాడిన…