మేకింగ్ వీడియో : “రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్” ఎలా ఉందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం “ఆర్ఆర్ఆర్”. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. అజయ్ దేవ్‌గన్, అలియా భట్, ఒలివియా మోరిస్ ఇతర కీలక పాత్రలు పోషించారు. “ఆర్ఆర్ఆర్” కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ఒక కల్పిత కథ. డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న “రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్” మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో సన్నివేశాలు, స్టంట్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చూస్తుంటే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ మేకింగ్ వీడియో చూసిన అభిమానులు ఖుషీ అవుతున్నారు.
Read Also : “టక్ జగదీష్” రిలీజ్ డేట్ ఫిక్స్ ?
Also Read
కాగా ఈ సినిమా రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయ్యింది. ఆగస్టులో సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలపై దృష్టి సారించనున్నారు రాజమౌళ. ముందుగా ప్రకటించినట్టుగానే ఈ ఏడాది అక్టోబర్ 13న సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఇదే విషయాన్నీ తాజాగా మేకింగ్ వీడియోలో కూడా తెలియజేశారు. మేకింగ్ వీడియోనే ఇలా ఉంటే ఈ చిత్రం కోసం రాజమౌళి ప్లాన్ చేసిన నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ ఎలా ఉంటాయో అనే చర్చ మొదలైపోయింది. ఆ విషయం గురించి సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా రిలీజ్ అయిన మేకింగ్ వీడియో అన్ని వర్గాల ప్రేక్షకుల దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా “రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్”వీడియోపై ఓ లుక్కేయండి మరి.
తాజావార్తలు
-
Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
-
Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!