MLC Nomination: పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున వూట్కూరి నరేందర్ రెడ్డి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టిన పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. నా మీద నమ్మకంతో నాకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ నాయకత్వానికి ధన్యవాదాలు. వారు నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు అండగా నిలుస్తుంది. ఎమ్మెల్సీగా గెలిచి సోనియా గాంధీకి గిఫ్ట్ ఇస్తానని నరేందర్ రెడ్డి…
మణిపూర్‌లో శాంతిని నెలకొల్పడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంఫాల్‌లో అమిత్ షా ఎన్నికల ర్యాలీ నిర్వహించారు.
హర్యానా రాష్ట్రంలోని నుహ్ జిల్లాలో విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. కొందరు వ్యక్తులు పలు వాహనాలకు నిప్పు పెట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
రాజధాని హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఈడీ కార్యాలయం వరకు కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో పలుచోట్లు అధికారులు మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతోపాటు వాహనాలను దారిమళ్లిస్తున్నారు. ఖైరతాబాద్ చౌరస్తా, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, చింతల్ బస్తీ, లక్డీకపూల్, బషీర్‌బాగ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ చౌరస్తా, ఎన్టీఆర్ మార్గ్, లిబర్టీ జంక్షన్, సచివాలయం మార్గాల్లో ఆంక్షలు విధించారు. ఈనేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ…
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ పర్యటనతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకవైపు కోవిడ్ నిబంధనలు, మరోవైపు బీజేపీ క్యాండిల్ ర్యాలీ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో బీజేపీ ర్యాలీకి అనుమతిలేదని అధికారికంగా పోలీసులు ప్రకటించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో మౌనంగా ర్యాలీ తీస్తామని బీజేపీ శ్రేణులు ప్రకటించాయి. సికింద్రాబాద్ గాంధీ విగ్రహం నుంచి రాణిగంజ్ వరకు ర్యాలీ చేపడతామని బీజేపీ తెలిపింది. దీంతో సికింద్రాబాద్ లో భారీగా పోలీసులు మోహరించారు.
సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా ర్యాలీలు జరుగుతున్నాయి. విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఎమ్మెల్యే గణేష్ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే గణేష్ ఆధ్వర్యంలో నర్సీపట్నంలో నిర్వహించిన మోటార్ సైకిల్ ర్యాలీ పార్టీ కార్యాలయం నుండి పోలీస్ స్టేషన్ వరకు కొనసాగింది. అనంతరం టౌన్ పోలీస్ స్టేషన్లో చంద్రబాబు, పట్టాభి, అయ్యన్నపాత్రుడిపై ఫిర్యాదు చేశారు. అబీద్ సెంటర్లో పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే గణేష్ మాట్లాడారు. టీడీపీ నాయకుడు…