Rajnath Singh Gifted Horse By Mongolian President: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగోలియా పర్యటనలో ఉన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. ఏడేళ్ల క్రితం ప్రధాని నరేంద్రమోదీ మంగోలియాలో పర్యటించారు. ఆ సమయంలో మంగోలియా ప్రభుత్వం మోదీకి ఓ గుర్రాన్ని బహూకరించింది. తాజాగా రాజ్ నాథ్ సింగ్ కు కూడా ఆ దేశాధ్యక్షడు ఖరేల్ సుఖ్ ఓ గుర్రాన్ని బహుమతిగా ప్రధానం చేశారు.