హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్‌లు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. థియేటర్లో అయినా ఓటీటీలో అయినా ఈ జానర్ చిత్రాలను ఆడియెన్స్ ఎక్కువగా చూస్తుంటారు. ప్రస్తుతం ఇలాంటి ఓ కాన్సెప్ట్‌తోనే ‘భవానీ వార్డ్ 1997’ చిత్రం రాబోతోంది. హారర్, థ్రిల్లర్ లవర్స్‌ను ఆకట్టుకునేందుకు ‘భవానీ వార్డ్ 1997’ అనే చిత్రం ఆడియెన్స్ ముందుకు త్వరలోనే రానుంది. జీడీఆర్ మోషన్ పిక్చర్, విభూ మీడియా సమర్పణలో చంద్రకాంత సోలంకి, జీడీ నరసింహా నిర్మించిన ఈ మూవీకి జీడీ నరసింహా దర్శకత్వం…