మాయమాటలు చెప్పడం. ప్రేమకబుర్లతో ఏమార్చడం, అమ్మాయిల్ని మోసం చేయడం ఈరోజుల్లో కామన్ అయిపోయింది. హైదరాబాద్ రాజేంద్రనగర్ లో దారుణం జరిగింది. ఉప్పర్ పల్లి వాంబే కాలనీ లో ఓ బాలికను ప్రేమిస్తున్నానని నమ్మించాడు షాబాజ్ అనే యువకుడు. ప్రేమ పేరుతో మోసం చేశాడు. ప్రియుడి మాటలు నమ్మి అతనితో చనువుగా తిరిగింది ఆ బాలిక. ఆ బాలికతో తనను పెండ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చాడా యువకుడు. పెండ్లికి నిరాకరించడంతో తనపై పగ పెంచుకున్నాడు యువకుడు. ఇద్దరూ కలిసి…
మహిళలు, యవతులు, విద్యార్ధినులు అనే తేడా లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. ముక్కుపచ్చలారని ఓ విద్యార్ధిపై అఘాయిత్యం చేశాడో ప్రబుద్ధుడు. రాజేంద్రనగర్ లో ఈ దారుణం జరిగింది. పదవ తరగతి విద్యార్ధినిపై అత్యాచారం చేశాడో యువకుడు. అమ్మాయికి మాయ మాటలు చెప్పి తన ఇంటి నుండి మోటర్ సైకిల్ పై హిమాయత్ సాగర్ తీసుకొని వెళ్ళాడా యువకుడు. చెట్ల పొదల్లోకి తీసుకొని వెళ్లి బలవంతంగా అత్యాచారానికి ఒడిగట్టాడు ఆ కామాంధుడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించాడు. అత్యాచారం…
అసలే లేడీ కిలాడీలు. నేరాల్లో ఆరితేరిపోయారు. ఏ చిన్న అవకాశాన్నీ వారు వదలరు. కోట్లు విలువ చేసే హెరాయిన్ స్మగ్లింగ్ చేశారు. చాలా బాగా మేనేజ్ చేశారు. కానీ హైదరాబాద్ కస్టమ్స్ అధికారుల ముందు వారి ఆటలు సాగలేదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 90 కోట్ల విలువైన హెరాయిన్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఇద్దరు మహిళా ప్రయాణీకులను అరెస్ట్ చేశారు కస్టమ్స్ అధికారులు. హెరాయిన్ ని తాము వెంట తెచ్చుకున్న ట్రాలీ బ్యాగ్…
శరవేగంగా విస్తరిస్తున్న భాగ్యనగరంలో అక్రమ నిర్మాణాలు మూడు అపార్ట్‌మెంట్లు, ఆరు టవర్లుగా వర్థిల్తుతున్నాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపించారు నగర జీహెచ్‌ఎంసీ అధికారులు. మొఘల్స్ కాలనీలో ఐదు అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు సర్కిల్ 6 అధికారుల బృందం. పలు సార్లు అక్రమ నిర్మాణాలపై యాజమానులకు నోటీసులు జారీ చేశారు అధికారులు. ఈ నోటీసులకు సమాధానం ఇవ్వకపోవడంతో ఈ ఉదయం కూల్చివేత శ్రీకారం చుట్టారు అధికారుల బృందం. భారీ పోలీసు బందోబస్తు…
గత నాలుగు రోజుల క్రితం రాజేంద్రనగర్ హైదర్‌గూడలో అదృశ్యమైన బాలుడు అనీష్ కుమార్ మృతి పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. అనీష్ కుమార్ ది ముమ్మాటికి హత్యేనని అంటున్నారు.గురువారం మధ్యాహ్నం అదృశ్యమైన అనీష్ కుమార్ కోసం చుట్టు పక్కల మొత్తం వెతికారు. బాలుడి మృతదేహం లభించిన నీళ్ల కుంట వద్ద కూడా పోలీసులతో ముందు రోజే గాలించారు. అక్కడ బాలుడికి సంబంధించిన ఏలాంటి ఆనవాలు లభించలేదు. కానీ మరుసటి రోజు మృతదేహం నీళ్ల…