మహిళలు, యవతులు, విద్యార్ధినులు అనే తేడా లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. ముక్కుపచ్చలారని ఓ విద్యార్ధిపై అఘాయిత్యం చేశాడో ప్రబుద్ధుడు. రాజేంద్రనగర్ లో ఈ దారుణం జరిగింది. పదవ తరగతి విద్యార్ధినిపై అత్యాచారం చేశాడో యువకుడు. అమ్మాయికి మాయ మాటలు చెప్పి తన ఇంటి నుండి మోటర్ సైకిల్ పై హిమాయత్ సాగర్ తీసుకొని వెళ్ళాడా యువకుడు. చెట్ల పొదల్లోకి తీసుకొని వెళ్లి బలవంతంగా అత్యాచారానికి ఒడిగట్టాడు ఆ కామాంధుడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించాడు.
అత్యాచారం అనంతరం తిరిగి ఆ విద్యార్ధినిని ఇంటి వద్ద వదలి వెళ్లిపోయాడు నిందితుడు. తనకు జరిగిన అన్యాయాన్ని తల్లితో చెప్పుకుంది బాధితురాలు. దీంతో రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది బాధితురాలి తల్లి. తల్లి ఫిర్యాదు మేరకు యువకుని పై రేప్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
నిందితుడి అరెస్ట్.. అతనూ మైనరే
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడిని అరెస్ట్ చేశామని శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి చెప్పారు. రేప్ కు పాల్పడిన నిందితుడు కూడా మైనరే. నిందితుడు కర్ణాటక వాసి. బాధితురాలకి నిందితుడు ముందు నుంచే తెలుసు. అమ్మాయి పట్ల చాలా కాలం నుంచి అసభ్య ప్రవర్తన ఇబ్బంది పెట్టాడు. 28 వ తేదిన ఈ ఘటన జరిగింది.గుడికి వెళదాం అని చెప్పి.. కోత్వాల్ లో ఉన్న పొదలలో అత్యాచారం చేశాడు. పిల్లర్ నంబర్ 118 వద్ధ నిందితుడిని అరెస్ట్ చేసాం. నిందితుడిని ఈరోజు రిమాండ్ కి తరలిస్తామన్నారు శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి.