తీవ్ర సంచలనం సృష్టించిన భూపాలపల్లికి చెందిన సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి (52) హత్య.. రాజకీయ దుమారం రేపుతోంది. ఈ హత్య వెనుక బీఆర్‌ఎస్ నేతలు, కేసీఆర్ కుటుంబం హస్తం ఉందంటూ మృతుడి భార్య సరళ ఆరోపించడంతో ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. రాజలింగమూర్తి గతంలో పలు భూ వివాదాలు, ప్రజా సమస్యలపై కోర్టుల్లో కేసులు వేయడం, 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ ఏడో బ్లాకు కుంగుబాటుపై అప్పటి సీఎం కేసీఆర్,…
Medigadda Barrage : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్), మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు కేసీఆర్, హరీష్ రావులు, ఇతరుల అవినీతే కారణమని ఆరోపిస్తూ భూపాలపల్లి జిల్లా కోర్టులో నాగవెల్లి రాజలింగమూర్తి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన భూపాలపల్లి జిల్లా…