Minister Nara Lokesh: తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో విద్యార్థులకు కీలక సూచనలు చేశారు మంత్రి నారా లోకేష్.. రాజమండ్రిలోని ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ‘హలో లోకేష్’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఆసక్తికరంగా, స్పష్టంగా సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మహిళల పట్ల గౌరవం, సమానత్వం ఎంతో అవసరమని లోకేష్ స్పష్టం చేశారు. మహిళలను అవమానపర్చేలా, కించపరిచేలా వ్యవహరించే చర్యలపై కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.…
రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో క్రికెట్ స్టేడియం ప్రతిపాదన ఇప్పుడు కాకరేపుతోంది.. రాజమండ్రిలో క్రికెట్ స్టేడియం ఏర్పాటును వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజలు ఆహ్వానిస్తున్నా.. ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో నిర్మాణం చేపట్టడాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.. ఇప్పటికే లెఫ్ట్ పార్టీలు ఈ ప్రతిపాదనలను తప్పుబట్టాయి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో స్టేడియం నిర్మాణ ప్రతిపాదనలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక, ఇదే వ్యవహారంలో సీఎం వైఎస్ జగన్‌కు లేఖ…
రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ లో క్రికెట్ స్టేడియం నిర్మించాలనే యోచన రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. దీనిపై ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి లేఖ రాయనున్నట్టు తెలిపారు.. ఆర్ట్స్ కాలేజ్ యూనివర్సిటీ అయితే భవన నిర్మాణాలు ఎక్కడ కడతారు ? అని ప్రశ్నించిన ఆయన.. ల్యాబ్స్ లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.. ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలని సూచించారు. ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ ను పరిశీలించిన సోము వీర్రాజుకు క్రికెట్ స్టేడియం నిర్మాణం…