బాలీవుడ్ ఇండస్ట్రీలో రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు ఎంతటి సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శిల్పాశెట్టి భర్తగా, వ్యాపారవేత్తగా పేరుతెచ్చుకున్న రాజ్ కుండా పోర్నోగ్రఫీ కేసులో జైలుకు వెళ్లి ఇటీవల బైత్ మీద బయటకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ వివాదంతో రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి పరువు నడిరోడ్డు మీద పడింది. దీంతో కొన్నిరోజులు శిల్పాశెట్టి మీడియాకు దూరంగా ఉంది. ఇక భర్త రాజ్ కుంద్రా బయటికి వచ్చాకా తమపై ఆరోపణలు చేసిన వారిపై…
శిల్పా శెట్టి, ఆమె భర్త గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తున్నారు. అసభ్యకరమైన సినిమాలు తీసినందుకు రాజ్ కుంద్రాను అరెస్టు చేశారు. దాదాపు 2 నెలలు జైలులో ఉన్న ఆయన ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నాడు. రాజ్ కుంద్రా అరెస్టు అయినప్పటి నుంచీ హీరోయిన్, మోడల్ షెర్లిన్ చోప్రా అతనిపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. తాజాగా ఆమె శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అక్టోబర్ 14 న షెర్లిన్ చోప్రా తనపై మోసానికి పాల్పడినందుకు,…
ప్రముఖ వ్యాపారవేత్త, స్టార్ బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు బెయిల్ లభించింది. పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన ఆయనకు రూ. 50వేల పూచీకత్తుపై బెయిల్‌ను ముంబైలోని మెట్రోపాలిటన్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సినిమా అవకాశం కోసం ముంబైకి వచ్చిన పలువురు యువతులను వంచించి రాజ్‌కుంద్రా భారీగా ఆర్జించినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దాంతో రెండు నెలల క్రితం పోర్నోగ్రఫీ కేసులో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో ఇటీవల 1400 పేజీల ఛార్జ్‌షీట్‌ను కూడా…
‘గండి బాత్’ అనే వెబ్ సిరీస్‌తో పాటు ఇతర టీవీ షోలలో కన్పించిన నటి, మోడల్ గెహన వశిష్ట ముంబై పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. గేహన వసిస్త పోలీసులపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. రాజ్ కుంద్రా పోర్న్ ఫిల్మ్ కేసులో నిందితురాలిగా ఉన్న ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో చిరిగిన బట్టలతో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ దానికి కారణం ముంబై పోలీసులే అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. “పోలీసులు నాకు ఈ దుస్థితిని తెచ్చారు. నా బ్యాంక్…
పోర్నోగ్రఫీ కేసులో అరెస్టైన రాజ్ కుంద్రా.. బెయిల్‌పై పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. ఇప్పటికి మూడు సార్లు బెయిల్ కోసం ప్రయత్నించి కుంద్రా విఫలమయ్యారు. తాజాగా బాంబే హైకోర్టు బెయిల్ నిరాకరించింది. రాజ్ కుంద్రా బాలీవుడ్ లోని మోడల్స్ తో పోర్న్ కంటెంట్ వీడియోలను తీసి యాప్ లలో అప్ లోడ్ చేస్తున్నట్టు పక్కా ఆధారాలతో గుర్తించిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. ఆయనను అరెస్ట్ చేశారు. రోజుకో కొత్త విషయాలు ఈ కేసులో వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో..…
రాజ్ కుంద్రా కేసు రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో భాగంగా శుక్రవారం ముంబై క్రైమ్ బ్రాంచ్ మోడల్, నటి షెర్లిన్ చోప్రాను విచారించింది. దాదాపు ఈ విచారణ 8 గంటలపాటు కొనసాగినట్టు తెలుస్తోంది. విచారణ అనంతరం షెర్లిన్ చోప్రా మీడియాతో మాట్లాడుతూ తాను ఇలాంటి కుంభకోణంలో చిక్కుకుంటానని అస్సలు అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో శిల్పా శెట్టి తన వీడియోలు, ఫోటోలను ఇష్టపడుతున్నారని రాజ్ కుంద్రా తనకు చెప్పాడని, అది కాస్తా…
బిజినెస్ లో రిస్క్ మంచిదేగానీ… రిస్కే బిజినెస్ గా మారితే కష్టమే! కష్టం మాత్రమే కాదు పెద్ద నష్టం కూడా! ఇప్పుడు అదే జరుగుతోంది, పాపం శిల్పా శెట్టి విషయంలో. ఆమె భర్త చేసిన రిస్కీ బిజినెస్ ఇప్పుడు తనకు కష్టంగా, నష్టంగా మారుతోంది. నిజంగా రాజ్ కుంద్రా నేరం చేశాడో లేదోగానీ ఆయన అరెస్ట్ అయితే మిసెస్ కుంద్రాని కాలు బయట పెట్టనీయటం లేదు. అదే మానసిక వ్యధకి, ఆర్దిక నష్టానికి కారణం అవుతోంది… Read…
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి గత కొన్ని రోజులుగా తన భర్త రాజ్ కుంద్రా కేసు కారణంగా వార్తల్లో నిలుస్తున్నారు. జూలై 19న పోర్న్ సినిమాలు తీసినందుకు రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత శిల్పాశెట్టి గురించి అనేక వార్తలు వచ్చాయి. రాజ్ కుంద్రాతో పాటు ఆయన ఫ్యామిలి, పిల్లలు, భార్యపై కూడా దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. రాజ్ ఇప్పటి వరకూ తన వెర్షన్ ఏంటో ఎవరికీ చెప్పలేదు. కానీ పోలిసులు ఇస్తున్న సమాచారం…
ఆశ్లీల చిత్రాలు నిర్మిస్తూ అడ్డంగా దొరికిపోయిన వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా.. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎలాంటి లీగల్ నోటీసులు ఇవ్వకుండానే.. ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్నాడు. తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ బాంబే హైకోర్టులో పిటిషన్ వేశాడు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఇరువైపుల వాదనలు వింది. అసలు రాజ్‌కుంద్రాను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో ధర్మాసనానికి వివరించారు పోలీసుల తరపు లాయర్. పొర్నోగ్రఫీ కేసులో…
శిల్పా శెట్టికి కోపం వచ్చింది. రాదా మరి? ఇష్టానుసారం వార్తలు రాస్తే ఎవరికైనా ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. అందుకే, కొన్ని మీడియా సంస్థలపై శిల్పా ఏకంగా 25 కోట్ల పరువు నష్టం దావా వేసింది! ఇంతకీ, కారణం ఏంటి అంటారా? ఆమె భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ వ్యవహారమే! సాధారణంగా ఒక సెలబ్రిటీ కానీ, వారి దగ్గరి వారుగానీ అరెస్ట్ అయితే పెద్ద రచ్చ అవుతూ ఉంటుంది. పైగా శిల్పా శెట్టి లాంటి గ్లామరస్ ఇమేజ్ ఉన్న…