రాజ్ కుంద్రా కేసు రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో భాగంగా శుక్రవారం ముంబై క్రైమ్ బ్రాంచ్ మోడల్, నటి షెర్లిన్ చోప్రాను విచారించింది. దాదాపు ఈ విచారణ 8 గంటలపాటు కొనసాగినట్టు తెలుస్తోంది. విచారణ అనంతరం షెర్లిన్ చోప్రా మీడియాతో మాట్లాడుతూ తాను ఇలాంటి కుంభకోణంలో చిక్కుకుంటానని అస్సలు అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో శిల్పా శెట్టి తన వీడియోలు, ఫోటోలను ఇష్టపడుతున్నారని రాజ్ కుంద్రా తనకు చెప్పాడని, అది కాస్తా తనకు ఇన్స్పిరేషన్ గా అన్పించిందని, సెమీ న్యూడ్, పోర్న్ సాధారణం అని, అందరూ చేస్తారని, తను కూడా చేయాలని రాజ్ తనతో చెప్పినట్టు షెర్లిన్ వెల్లడించింది.
Read Also : విమెన్ హాకీ టీంకు “తూఫాన్” హీరో విషెష్…. దారుణంగా ట్రోలింగ్
శిల్పా శెట్టి వంటి వ్యక్తికి నచ్చింది అని చెప్పడంతో ఏది తప్పు, ఏది ఒప్పు అనే విషయం అర్థం కాలేదని తెలిపింది. మొదట రాజ్ కుంద్రాను కలిసినప్పుడు జీవితం మారిపోతుందని, మూవీ కెరీర్ లో బ్రేక్ వచ్చిందని, కానీ శిల్పా శెట్టి భర్త నన్ను తప్పు పనులు చేస్తాడని ఎప్పుడూ అనుకోలేదు అంటూ చెప్పుకొచ్చింది. మరి శిల్పా శెట్టి ఈ వార్తలపై ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటికే ఆమె తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. ఇలాంటి సమయంలో షెర్లిన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.