Bandi Sanjay : ఎన్నికల కోడ్ సాకుతో రైతు భరోసా పథకాన్ని నిలిపివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. రైతు భరోసా పథకం కొనసాగుతున్న పథకమే అయినందున ఎన్నికల సంఘం నుండి ఎలాంటి ఇబ్బందులు ఉండబోవన్నారు. పైగా జరిగే ఎన్నికలు పట్టభద్రులు, ఉపాధ్యాయులకు సంబంధించినవి అయినందును ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశాలు కూడా లేవన్నారు. అవసరమైతే బీజేపీ పక్షాన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి…
Grama Sabalu : చింతకాని మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు ఈనెల 26 నుండి ప్రారంభం కానున్నాయి. వీటిలో ముఖ్యంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు ఉన్నాయి. ఈ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఈరోజు ఉదయం 10 గంటలకు స్థానిక పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామసభకు పంచాయతీ కార్యదర్శి రమేష్ అధ్యక్షత వహించగా, మండల…
TG Cabinet Meeting : సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా, ‘రైతు భరోసా’ పథకం విధివిధానాలు ఖరారు చేయడం ఈ భేటీకి ప్రధాన అజెండాగా కనిపిస్తోంది. కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే రైతు భరోసాపై కొన్ని సిఫార్సులు రూపొందించింది. వీటిలో పంట వేసిన ప్రతి రైతుకు పెట్టుబడి…
ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తున్నారని.. ఇది చారిత్రక నిర్ణయమని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి అన్నారు. కేటీఆర్ అసలైన కోతల మాస్టర్ అని.. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడం కేసీఆర్, కేటీఆర్‌లకు ఇష్టం లేనట్లుందని ఆయన విమర్శించారు.
TS 6 Guarantees: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు హామీల అమలు దిశగా తీవ్ర కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఆరు హామీలకు సంబంధించి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
జగన్ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. వివిధ జిల్లాల కలెక్టర్లు, ఉన్నతస్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలు కీలక నిర్ణయాలు వెల్లడించారు. డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తొలివిడత 4,314 డిజిటల్ లైబ్రరీలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. డిజిటల్ లైబ్రరీలకు అవసరమయ్యె ఇంటర్‌నెట్‌లో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలని, అప్పుడే వర్క్ హోం కాన్సెప్ట్ విజయవంతం అవుతుందన్నారు. దీంతో పాటు రైతు భరోసా రెండో విడత కార్యక్రమాన్ని…