ఈ రోజు, రేపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.. నిన్నటి ఝార్ఖండ్ మరియు పరిసర ప్రాంతాలలో ఉన్న అల్పపీడనము ఈరోజు తెలంగాణ నుండి దూరంగా వెళ్ళిపోయింది. నైరుతి రుతువనాలు తెలంగాణాపై చురుకుగా కదులుతున్నవని.. ఈ రోజు క్రింది స్థాయి నుండి పశ్చిమ గాలులు బలంగా వీస్తున్నాయని.. వీటి ప్రభావంతో.. రాగల మూడు రోజులు (15,16,17వ తేదీలు) తేలికపాటి…
ఈరోజు తెల్లవారుజాము నుంచి నగరంలో భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడటంతో లోతట్టుప్రాంతాలు జలమయం అయ్యాయి. తెల్లవారు జాము 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వర్షం కురిసింది. నైరుతీ రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత రెండు రోజులుగా వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోనే కాకుండా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
జూరాల ప్రాజెక్టు కు వరద కొనసాగుతుంది. ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు గేట్ల మరమ్మతుల కారణంగా నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నారాయణపూర్ ప్రాజెక్టులో ఇన్ ఫ్లో 13,200 క్యూసెకులు ఉండగా… ఔట్ ఫ్లో 20,075 గా ఉంది. ఇక నారాయణపూర్ పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 అడుగులు కాగా ప్రస్తుతం 318.140 అడుగులుగా ఉంది. అలాగే పూర్తిస్దాయి నీటి నిల్వ 9.657 టిఎంసీలు కాగా ప్రస్తుతం 8.888 టీఎంసీలు ఉంది. అయితే విద్యుత్…
శ్రీశైలం జలాశయంలో వరద నీరు క్రమంగా పెరుగుతుంది. నేడు జూరాల నుండి 17,264 క్యూసెక్కులు, సుంకేసుల నుండి 3,309 శ్రీశైలం జలాశయంలో చేరింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 20,573 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో నిల్ గా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 809.20 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 33.8613 టీఎంసీలు ఉంది. ఇక కుడి గట్టు,…
కరోనా మహమ్మారి దేశాన్ని అల్లకల్లోలం చేసింది.. ఇక, మహారాష్ట్రలో చెప్పాల్సిన పనేలేదు.. అందులో ముంబై ఎదురైన అనుభవం మామూలుదికాదు.. అయితే, ఇప్పుడిప్పుడే కరోనా నుండి తేరుకుంటున్న ముంబై ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత రెండు రోజులగా కురిసిన వర్షాలతో ముంబై మొత్తం జలమయమైంది. ఇప్పటికే ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ అధికారులు ప్రజలకు సూచనలు సైతం చేశారు. ఈ క్రమంలో ముంబై వాసులకు ఐఎండీ అలర్ట్ జారీ చేసింది. వచ్చే…
ముంబైలో ఘోర ప్రమాదం జరిగింది. గత కొన్ని రోజులుగా ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా మల్వాని లోని ఓ నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతిచెందారు. 8 మందికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న అత్యవసర, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని శిధిలాల కింద చిక్కుకున్న 15 మందిని రక్షించారు. భవనం కుప్పకూలిపోవడంతో సమీపంలో ఉన్న కొన్ని భవనాలలోని ప్రజలకు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.…
మరో రెండు, మూడు రోజుల్లో తెలంగాణలో ప్రవేశించనున్నాయి నైరుతి రుతుపవనాలు.. నిన్న దక్షిణ కేరళలోకి ప్రవేశించిన నైరుతి ఋతుపవనాలు ఈ రోజు కేరళా అంతటా మరియు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్‌లో కొంత భాగంలోకి ప్రవేశించాయి… రాగల 2 నుండి 3 రోజులలో తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ జిల్లాలలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.. ఇక, దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరియు తెలంగాణ నుండి…
ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుసే అవకాశం ఉందని వెల్లడించింది అమరావతి వాతావరణ కేంద్రం.. అత్యంత తీవ్ర తుఫాన్ ‘తౌక్టే’ గడచిన 6 గంటల్లో 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ, బలహీనపడి ఈ రోజు ఉదయం 08:30 గంటలకు సౌరాష్ట్ర ప్రాంతంలో ‘అతి తీవ్ర తుఫానుగాస మారిందని.. అమ్రేలికి తూర్పు దిశగా 10 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని.. రాగల 3గంటలలో ఇది ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి, మరింత బలహీనపడి తుఫాన్‌గా.. ఈరోజు…
టౌటే తుఫాన్ ధాటికి తీరప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ఆ తుఫాన్ ధాటికి చిగురుటాకులా వణుకుతున్నాయి. ఇక, దీని ప్రభావం తెలుగురాష్ట్రాలపై పడింది. హైదరాబాద్‌లో ఈ ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తున్నది. ఉదయం నుంచి పెద్ద ఎత్తున వర్షం కురుస్తుండటంతో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. లాక్‌డౌన్ సడలింపుల సమయంలో భారీ వర్షం కురుస్తుండటంతో బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఉదయం 5 గంటల నుంచే భారీ వర్షం కురవడం మొదలైంది. బంజారాహిల్స్,…
తెలంగాణలో అకాల వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల్లో పంటలకు తీవ్ర నష్టమే జరిగింది.. కొన్ని ప్రాంతాల్లో వడగళ్లు.. రైతులకు కడగళ్లు మిగిల్చాయి.. అయితే, మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని సూచించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. నిన్నటి నుంచి ఉన్న ఉత్తర- దక్షిణ ఉపరితల ఆవర్తనం, మరత్వాడా నుండి ఇంటీరియర్ కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ మీదగా దక్షిణ కోస్తా తమళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9…