శ్రీశైలం జలాశయంలో వరద నీరు క్రమంగా పెరుగుతుంది. నేడు జూరాల నుండి 17,264 క్యూసెక్కులు, సుంకేసుల నుండి 3,309 శ్రీశైలం జలాశయంలో చేరింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 20,573 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో నిల్ గా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 809.20 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 33.8613 టీఎంసీలు ఉంది. ఇక కుడి గట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి ప్రస్తుతం నిలిచిపోయింది.