కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారింది. నిన్నటిలానే పలుమార్లు ఇబ్బంది పెట్టిన వరుణుడు.. ఇవాళ కూడా నేనున్నానంటూ వచ్చేశాడు. దీంతో భారత్ ఇన్నింగ్స్ 47 ఓవర్లు పూర్తయ్యాక వర్షం పడుతుండటంతో ఆటను నిలిపివేశారు. ప్రస్తుతం భారత్ 9 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది.
Rain Threat to IND vs SL Super Four Match in Asia Cup 2023: ఆసియా కప్ 2023 సూపర్-4లో భాగంగా సోమవారం ముగిసిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్.. మరో కీలక సమయానికి సిద్ధమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకతో నేడు రోహిత్ సేన తలపడనుంది. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలోనే ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ఆరంభం అవుతుంది. ఈ మ్యాచ్…
శ్రీలంక రాజధాని కొలంబోలో భారీ వర్షం పడుతుంది. దీంతో భారత్-పాక్ మ్యాచ్ మరింత ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఈ ఉదయం వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ.. ఇవాళ భారత్-పాకిస్తాన్ మ్యాచ్ పూర్తవుతుందని అందరూ భావించారు. కానీ ఉన్నట్టుంది ఒక్కసారిగా వాతావరణం తారుమారై వర్షం కురిసింది. కొలంబోలో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుంది. దీంతో గ్రౌండ్ మొత్తం కవర్లతో కప్పివేశారు.
ఆసియా కప్ 2023 టోర్నీ సూపర్ 4 రౌండ్‌లో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్ డేకు వాయిదా పడింది. టాస్ గెలిచిన పాక్ జట్టు బౌలింగ్ ఎంచుకోగా.. భారత జట్టు బ్యాటింగ్ బరిలోకి దిగింది.
What happens if Asia Cup 2023 Super-4 Matches in Colombo are washed out: ఆసియా కప్ 2023లో గ్రూప్ దశ ముగిసి.. సూపర్-4 సాగుతోంది. సూపర్-4 తొలి మ్యాచ్ లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో జరగ్గా.. బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ విజయం సాధించింది. ఇక సూపర్-4లో మిగిలిన 5 మ్యాచ్‌లు శ్రీలంకలోని కోలంబోలో జరగనున్నాయి. సూపర్-4లో భారత్, శ్రీలంక జట్లు మూడేసి మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు మాత్రం రెండేసి మ్యాచ్‌లను ఆడుతాయి.…
Heavy Rain Falls in Hyderabad: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. సోమవారం నుంచే వర్షం పడుతున్నా.. మంగళవారం తెల్లవారుజాము 2-3 గంటల నుంచి భారీ వర్షం పడుతోంది. వర్షం ధాటికి నగరంలోని రోడ్లు జలమయమవ్వడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రోడ్లపై వర్షపు నీరు పరుగులు పెడుతుండడంతో ద్విచక్ర వాహనదారులు ముందుకు వెళ్లేందుకు వెనకడుగువేస్తున్నారు. కాటేదాన్, నార్సింగీ, మణికొండ,…
Woman Fell in to Hussain Sagar Nala at Gandhinagar: హైదరాబాద్‌లో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లపై వర్షం నీరు వేగంగా ప్రవహిస్తోంది. భారీ వర్షానికి జన జీవనం పూర్తిగా అస్తవ్యస్తం అయ్యింది. ఈ క్రమంలో హైదరాబాద్ గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. హుస్సేన్ సాగర్ నాలాలో పడి ఓ మహిళ గల్లంతైంది. తన అమ్మ కనిపించడం లేదని సదరు…
Heavy Rain in Telangana State: ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కాస్త అల్పపీడనంగా మారింది. ఈ అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో కొన్ని చోట్ల జనజీవనం స్తంభించింది. ఆదివారం నుంచి నిజామాబాద్‌లో ఎడతెరిపిలేని వర్షం…
Asia Cup 2023 Super 4 games likely to be shifted: ఆసియా కప్ 2023కి పాకిస్థాన్, శ్రీలంకలు ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. పాక్లో 4, లంకలో 9 మ్యాచ్‌లు నిర్వహించేలా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం గ్రూప్ దశ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. పాక్లో మ్యాచ్‌లు సజావుగానే జరుగుతున్నా.. శ్రీలంకలోని మ్యాచ్లకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. పల్లెకెలెలో శనివారం జరిగిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ రద్దయింది. రానున్న రోజుల్లో…
Burning Man Festival: అక్కడికి వచ్చిన వారందరూ పండగ కోసమని ఎంతో ఉత్సాహంగా అక్కడికి వచ్చారు. పండుగలో ఆనందంగా గడపాల్సిన వారు అనుకోని పరిస్థితుల కారణంగా అక్కడ చిక్కుకుపోవాల్సింది. ఇలా ఇరుక్కున్నది ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 70 వేల మంది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇది జరిగింది నెవడాలోని బ్లాక్రాక్ ఎడారిలో. అమెరికాలో బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ చాలా ఫేమస్. చాలా మందికి దీనికి హాజరుకావడానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా…