Hyderabad Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. నాలాలో పడిపోయిన 55 ఏళ్ల మహిళ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Fell in to Hussain Sagar Nala at Gandhinagar: హైదరాబాద్‌లో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లపై వర్షం నీరు వేగంగా ప్రవహిస్తోంది. భారీ వర్షానికి జన జీవనం పూర్తిగా అస్తవ్యస్తం అయ్యింది. ఈ క్రమంలో హైదరాబాద్ గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. హుస్సేన్ సాగర్ నాలాలో పడి ఓ మహిళ గల్లంతైంది. తన అమ్మ కనిపించడం లేదని సదరు మహిళ కుమార్తె గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్‌బీఐ కాలనీ దామోదరం సంజీవయ్య నగర్‌లో లక్ష్మీ (55) అనే మహిళ ఉంటుంది. ఆమెకు ముగ్గురు కుమార్తెలు. ముగ్గురుకి వివాహం అవ్వడంతో ఇంట్లో ఆమె ఒంటరిగా ఉంటోంది. ఇటీవల వర్షానికి గోడ కూలిపోవడంతో.. ప్రహరీ లేక లక్ష్మీ ఇబ్బందులు పడుతోంది. అయితే ఆమె కనిపించకుండా పోయింది. ఇంటి వద్ద పగిలిన గాజులు కనిపించడంతో.. నాలాలో పడిపోయినట్లు కుటుంబ సభ్యుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Dharmana Prasada Rao: స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఏం చేస్తారో చూపించండి.. ధర్మాన సవాల్
- India vs Pakistan: "అసలు మజా అప్పుడే".. దాయాదుల మధ్య పసిడి పోరు..
- Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
- BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
Also Read: CM KCR: సీఎం కేసీఆర్ నిఖార్సైన హిందూ.. గుండెల నిండా భక్తిభావం గల వ్యక్తి!
లక్ష్మి ఇంట్లో గ్యాస్ స్టవ్‌పై వంట చేస్తోంది. బియ్యం గిన్నె స్టవ్‌పై ఉంది. అలానే సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టి ఉండడం, అక్కడే చెప్పులు కూడా ఉండడంతో.. ఆమె హుస్సేన్ సాగర్ నాలాలో పడిపోయినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గాంధీనగర్ పోలీసులకు లక్ష్మీ కుమార్తె సునీత ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లక్ష్మి కోసం గాలింపులు చేపట్టారు.
లక్ష్మి కూతురు సుకన్య ఎన్‌టీవీతో మాట్లాడుతూ… ‘మా అమ్మ హుస్సేన్ సాగర్ నాలాలో పడి గల్లంతయింది. నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి కనిపించకుండాపోయింది. మా అమ్మ ఆచూకీ కోసం గాంధీనగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసాము. మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నమని పోలీసులు చెప్పారు. మా కిచెన్ ప్రహరీ వద్ద పగిలిన గాజులు కనిపించడంతో అమ్మ నాలాలో పడిపోయినట్లు అనుమానంగా ఉంది. రిటేయినింగ్ వాల్ లేక ఇబ్బందులు పడుతున్నాము. గత రెండు సంవత్సరాలుగా ఇంటికి టాయిలెట్ లేక మా అమ్మ ఇబ్బందులు పడుతుంది. మాకు వివాహం అవడంతో ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంటోంది. అధికారులు, పోలీసులు స్పందించి మా అమ్మ ఆచూకీ తెలపాలని వేడుకుంటున్నాం’ అని అన్నారు.
మహిళ గల్లంతు అనే వార్త ఎన్‌టీవీలో ప్రసారంతో అధికార యంత్రాంగం, పోలీసులు హుటాహుటిన లక్ష్మి ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. మహిళ ఆచూకీ కోసం ముడు ఢీఆర్‌ఎఫ్ బృందాలు నాలా రూట్ మ్యాప్ చూస్తూ గాలిస్తున్నాయి.
- Tags
- hyderabad
- Hyderabad Rain
- Nala
- rain
- Woman
తాజావార్తలు
-
Dharmana Prasada Rao: స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఏం చేస్తారో చూపించండి.. ధర్మాన సవాల్
-
India vs Pakistan: “అసలు మజా అప్పుడే”.. దాయాదుల మధ్య పసిడి పోరు..
-
Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
-
Abhishek Sharma Bowling: ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ సంచలనం.. వరుసగా మూడు వికెట్స్!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!