అధికారులతో సీఎస్ శాంతికుమారి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. మరో మూడు రోజుల పాటు వర్షాలు ఉన్న క్రమంలో.. జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జిల్లాల్లో ఏ విధమైన ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా కలుగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. ముందుగానే పునరావాస కేంద్రాల ఏర్పాటు పై చర్యలు తీసుకోవాలని.. పోలీస్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, అగ్నిమాపక శాఖ, NDRF,…
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ప్రతి ఒక్కరూ ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి ఇష్టపడతారు. బాల్కనీలోనో, కిటికీలోనో కురుస్తున్న చినుకులను చూసి ఆస్వాదించేవారు కొందరైతే, వర్షంలో తడిచేవాళ్లు మరికొందరు.
దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం వెల్లడించింది.
నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన విషాద ఘటన నాగర్ కర్నూల్ మండలం వనపట్లలో జరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. గత రెండ్రోజులగా కుండపోత వర్షం కురవడంతో నగరం గజగజ వణికిపోయింది. రోడ్లు చెరువులను తలపించాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు.
రెండ్రోజుల నుంచి ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షానికి దేశ రాజధాని ఢిల్లీ అతలాకుతలం అయింది. దీంతో రోడ్లు, ఇళ్లు జలమయం అయ్యాయి. ఇక లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం.. ఇంకోవైపు ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో జనాలు నానా అవస్థలు పడుతున్నారు. ఇక ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోయింది.
రేపు ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్, కెన్సింగ్టన్ ఓవల్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ టైటిల్ పోరుకు ముందే క్రికెట్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్ వస్తోంది. జూన్ 29న బార్బడోస్‌లో వర్షం పడే సూచన ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ వర్సెస్ సౌతాఫ్రికా ఫైనల్…
కాసేపట్లో టీ20 వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్ ప్రారంభం కానుంది. సెమీ ఫైనల్లో భాగంగా ఇండియా-ఇంగ్లండ్ మధ్య మరికాసేపట్లో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ జరగనున్న గయానా స్టేడియం వద్ద వర్షం కురుస్తోంది. టాస్ కు ఇంకా 2 గంటల సమయం మాత్రమే ఉంది. అయితే అప్పటివరకు వాన తగ్గుతుందా..? లేదా అనేది ఉత్కంఠగా మారింది. కాగా.. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు. వర్షం పడితే అదనంగా మరో 250 నిమిషాల సమయం కేటాయించానున్నారు. లేదంటే..…
గత కొద్ది రోజులుగా వేడి గాలులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న హస్తిన వాసులకు శుక్రవారం ఉపశమనం లభించింది. పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అలాగే హర్యానాలోని గురుగ్రామ్‌లో కూడా భారీ వర్షం కురుస్తోంది.