ఈరోజుల్లో డబ్బులను సంపాదించడం కన్నా ఖర్చులు అధికంగా ఉన్నాయన్న విషయం తెలిసిందే.. దాంతో ఆర్థిక ఇబ్బందులు కూడా ఆదిమవుతున్నాయి. ఇంకొందరు ఎంత కష్టపడినా కూడా చేతిలో డబ్బులు వినడం లేదని దిగులు చెందుతూ ఉంటారు. ఆర్థిక సమస్యలుగా సతమతమవడంతో పాటు అప్పు మీద అప్పు చేస్తూ ఉంటారు. అలా అప్పుల పాలు అవుతున్నవారు వర్షపు నీటితో కొన్ని రకాల పరిహారాలు పాటించడం వల్ల అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. మరి ఆర్థిక సమస్యలు పోవాలంటే ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం..
అప్పు తీర్చలేకపోతే ఒక బకెట్‌లో వర్షపు నీటిని సేకరించి అందులో పాలు పోసి భగవంతుడిని స్మరించుకుని ఈ నీళ్ల తో స్నానం చెయ్యాలని నిపుణులు చెబుతున్నారు..వ్యాపారంలో నష్టం వాటిల్లితే ఇత్తడి పాత్రలో వర్షపు నీటిని సేకరించి ఏకాదశి రోజున ఈ నీటితో అమ్మవారికి, విష్ణుమూర్తికి అభిషేకం చేయాలి. ఈ పరిహారాన్ని కూడా చాలా మంది నమ్ముతారు. అలాగే మీరు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటే మట్టి కుండలో వర్షపు నీటిని సేకరించి ఇంటికి ఈశాన్య లేదా ఉత్తరం వైపు ఉంచాలి.దాంతో సమస్యలు తగ్గిపోతాయని చెబుతున్నారు..
అలాగే ఒక గిన్నెలో వర్షపు నీటిని నింపి పైకప్పుపై ఉంచి ఆ తర్వాత మీకు ఇష్ట దైవాన్ని తలచుకుంటూ మామిడి ఆకుతో ఇంట్లో నీటిని చల్లాలని కూడా నమ్ముతారు. తల్లి లక్ష్మి ఈ పరిహారంతో సంతోషిస్తుంది. డబ్బు కొరతను కూడా ఉండదు. అదేవిధంగా వాస్తు శాస్త్రం ప్రకారం ఎవరికైనా వివాహంలో ఇబ్బంది ఉంటే, పోతాయి…ఏ రకమైన వ్యాధి లేదా ఏదైనా సంక్షోభం ఉంటే, వర్షం నీటిని సేకరించి, మహామృత్యుంజయ మంత్రంతో శివునికి అభిషేకం చేయడం మంచిది. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉంది అనుకుంటే ఏదైనా పాత్రలో వర్షపు నీటిని సేకరించి ఆంజనేయుడి ముందు ఉంచాలిఇలా చేసి చూడండి.. ఫలితం మీరే గమనించండి..