ఖమ్మం జిల్లా వేంసూర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ధాన్యం తడవకుండా పట్టాను కప్పుతున్న సమయంలో పిడుగు పాటుకు గురై 24 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తూ ఉండటంతో ఆరపోసిన ధాన్యం తడిసిపోతోందని ఆవేదన చెందిన యువ రైతు సాగర్.. ఆ ధాన్యం రాశి వద్దకు వెళ్లి పట్టాను కప్పు తున్న సమయంలో పిడుగు పడటం తో అక్కడికక్కడే మృతి చెందాడు. సాగర్ వేంసూర్ వెటర్నరీ హాస్పటల్…
ఈ రోజు తెల్లవారుజామున ఒక్క సారిగా కురిసిన భారీ వర్షం, గాలుల నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని సీజీమ్, సూపరింటిండెంట్ ఇంజినీర్లతో సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రఘుమా రెడ్డి ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యుత్ సరఫరా పరిస్థితిని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలపై కూలిన చెట్ల మూలాన విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగిందని ఆయన అధికారులు వివరించారు. ఈ సందర్భంగా రఘుమా…
ఏపీలో ఒకవైపు విద్యుత్ కోతలు.. మండుతున్న ఎండలతో జనం ఇబ్బందులు పడుతున్న వేళ మరో పిడుగు పడింది. విశాఖపట్టణం సమీపంలోని ఎన్టీపీసీ సింహాద్రిలోని 4 యూనిట్లలో ఒకేసారి విద్యుదుత్పత్తి నిలిచిపోవడంతో అంధకారం నెలకొంది. మంగళవారం ఉదయం 3 గంటల నుంచి 2 వేల మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో ఎన్టీపీసీ పరిసరాలు అంధకారంలోకి వెళ్లిపోయాయి. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు విద్యుదుత్పత్తిని పునరుద్ధరించే చర్యలు చేపట్టారు. ఒకేసారి నాలుగు యూనిట్లలో విద్యుదుత్పత్తి నిలిచిపోవడం ఇదే ప్రథమం అని…
ధర్మశాల వేదికగా శనివారం రాత్రికి టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య రెండో టీ20 జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ధర్మశాలలో ఆకాశమంతా మబ్బులు కమ్ముకున్నాయి. మధ్యాహ్నం 2-3 గంటల ప్రాంతంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. సాయంత్రానికి వర్షం ఆగిపోయినా మబ్బులు ఉంటాయన్నారు. పైగా ఆదివారం జరిగే మూడో మ్యాచ్‌పైనా వాతావరణ ప్రభావం ఉండొచ్చని తెలిపారు. కాగా టీ20లలో టీమిండియా…
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వడగళ్ల వర్షాలు రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో అన్నదాతలు తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ విషయాన్ని సోమవారం నాటి కేబినెట్ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి.. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్వయంగా వరంగల్ జిల్లాలో పర్యటించి రైతుల కష్టాలను తెలుసుకుందామని భావించారు. అయితే అనివార్య కారణాల వల్ల సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన…
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారి తమిళనాడు, ఏపీలో ప్రభావం చూపుతోంది. చిత్తూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తిరుపతిలో సైతం వర్షాలతో ఇళ్లలోకి నీరు వచ్చి చేరుతోంది. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు సహాయచర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వర్షాల కారణంగా శ్రీవారి దర్శనానికి తిరుమలకు రాలేకపోతున్న భక్తులకు ఊరట కలిగించే విషయాన్ని తెలిపింది.…
కనివిని ఎరుగని రీతిలో జలప్రళయం ముంచుకొచ్చింది. తమిళనాడుతో పాటు ఏపీలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. చైన్నైకి ఆగ్నేయ దిశగా 150 కిలోమీటర్ల వద్ద వాయుగుండం కేంద్రీకృతమైంది. పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 18 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు. Also Read : వరద నీటిలో కొట్టుకుపోయిన నలుగురు మహిళలు ఈ రోజు తెల్లవారుజామున 3-4 గంటల మధ్య చెన్నై-పుదుచ్చేరి మధ్య వాయుగుండం…
దక్షిణ అండమాన్ సముదంలో అల్పపీడనం ఏర్పడడంతో ఏపీ, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, కోస్టల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర వాతావరణ శాఖ ఆయా రాష్ట్రాలు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. రానున్న వర్షాల ప్రభావం ధాన్యం కొనుగోళ్లపై పడకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. ధాన్యాన్ని వర్షాల నుంచి రక్షించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. 4,039 ధాన్యం కోనుగోలు కేంద్రాలలో యుద్ధప్రతిపాదికనగా వర్షం…