Rain Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి భాతర వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం బలపడుతూ.. అల్పపీడనంగా మారుతుందని ఐఎండీ సూచించింది.
దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర తమిళనాడు దిశగా పయనించనుందని..దీని ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గాలుల తీవ్రత పెరగి సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇప్పటికే ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుడం కొనసాగుతోంది. తమిళనాడులోని నాగపట్నం నుంచి 320 కి.మీ దూరంలో కేంద్రీకృతం కావడంతో 13 కి.మీల వేగంతో ఉత్తర దిశగా వాయుగుడం కదులుతోంది. ఇది సాయంత్రం…