Trains Cancelled: మెంథా తుఫాన్ తీరం వైపు దూసుకొస్తుంది.. దీంతో, ప్రభుత్వం వివిధ శాఖల అధికారులను అప్రమత్తం చేసింది.. మరోవైపు.. తుఫాన్ ప్రభావంతో రైల్వేశాఖ అప్రమత్తం అయ్యింది.. ఓవైపు తూర్పు కోస్టల్ రైల్వే.. మరోవైపు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు అప్రమత్తమై పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.. మెంథా తుఫాన్ కదలికలపై నిరంతర పర్యవేక్షిస్తోన్న రైల్వేశాఖ.. తూర్పు కోస్టల్ రైల్వే జోన్ పరిధిలో హై అలెర్ట్ ప్రకటించింది.. విశాఖ మీదగా ప్రయాణించే 43 రైళ్లను…
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనపై రైల్వే శాఖ స్పందించింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన దురదృష్టకర సంఘటనపై జరుగుతున్న విచారణకు సంబంధించి తప్పుదారి పట్టించేలా కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయని పేర్కొంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాటపై RPF విచారణ అంటూ ఇవాళ తప్పుదారి పట్టించారని.. రైల్వే స్టేషన్ తొక్కిసలాటపై నార్త్ రైల్వే ఇప్పటికే ఇద్దరు సభ్యుల ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందని వెల్లడించింది.
దసరా సెలవులు కూడా తోడు కావడంతో పర్యాటకులను ఆకర్షించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది రైల్వేశాఖ. పర్యాటకుల రద్దీని క్యాష్ చేసుకునే విధంగా.. ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్టు ప్రకటించింది.. ఈనెల 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అరకుకు ప్రత్యేక రైలు నడపనుంది రైల్వే శాఖ. దసరా సీజన్ సందర్భంగా పర్యాటకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అరకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు పేర్కొంది.
Changes in Vande Bharat Express: దూర ప్రాంతాలకు చేరేందుకు నేటికి చాలా మంది సామాన్యుల ప్రయాణ సాధనం రైళ్లు. అయితే గతంతో పోలిస్తే భారత రైల్వే వ్యవస్థలో అనేక మార్పులు సంతరించుకున్నారు. ప్రయాణీకులు సౌకర్యార్థం అనేక మార్పులు చేశారు. ప్రస్తుతానికి వేగవంతంగా, సురక్షితంగా ప్రయాణించే వందే భారత్ ఎక్స్ ప్రెస్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా ప్రయాణ సమయం చాలా వరకు తగ్గిపోతుంది. అది వరకు పట్టే సమయంలో సగం మాత్రమే పడుతుంది. అయితే ఈ…
ఒడిషా రైలు ప్రమాదంలో నిర్లక్ష్యంగా వ్యవహారించిన అధికారులపై రైల్వే శాఖ వేటు వేసింది. తమ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహారించడం వల్ల వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని.. వేలాది మంది గాయపడ్డారని పేర్కొంటూ.. ఏడు మందిపై రైల్వే శాఖ వేటు వేసింది.
Rail Engine Theft: బీహార్‌లో రైలు ఇంజిన్‌ను కొంతమంది దొంగలు మాయం చేశారని.. సొరంగంలోకి ఇంజిన్‌ను తీసుకువెళ్లి ముక్కలుగా మార్చి వివిధ జిల్లాలోని స్క్రాప్ దుకాణాల్లో అమ్మేశారని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై రైల్వేశాఖ అధికారులు స్పందించారు. ఇది ఒక ఫేక్ న్యూస్ అని వాళ్లు స్పష్టం చేశారు. బెగుసరాయ్ జిల్లా బరౌనీ ప్రాంతంలోని గర్హరా రైల్వేయార్డులో ఒక స్పేర్ రైల్ ఇంజిన్ ఉంచామని.. అందులోకి దొంగలు ప్రవేశించి కొన్ని కేబుళ్లను…
Vijayawada: దసరా పండగ సమయంలో ప్రత్యేక రైళ్లను నడపాల్సిన అధికారులు ఉన్న రైళ్లు రద్దు చేశారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునీకరణ పనుల కోసం విజయవాడ మీదుగా నడిచే వందలాది రైళ్లను రద్దు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా కొన్ని రైళ్లను దారి మళ్లించారని.. విజయవాడ స్టేషన్‌కు వెళ్లకుండా రాయనపాడు, రామవరప్పాడు స్టేషన్‌లలో కొన్ని రైళ్లకు హాల్టింగ్ కల్పించారని ఓ మెసేజ్ తెగ సర్క్యులేట్ అవుతోంది. 9 9…
పర్యాటక ప్రియుల కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేకంగా తీర్థయాత్ర రైళ్లను నడుపుతోంది. ఈ నేపథ్యంలో భారత్ దర్శన్ కార్యక్రమంలో భాగంగా మార్చిలో ఉత్తర భారత యాత్రను నిర్వహిస్తోంది. రాజమండ్రి నుంచి ఈ రైలు బయలుదేరుతుందని ఐఆర్‌సీటీసీ డీజీఎం కిషోర్ సత్య, ఏరియా మేనేజర్ కృష్ణ వెల్లడించారు. మార్చి 19న రాజమండ్రి నుంచి ఈ రైలు బయలుదేరి సామర్లకోట, తుని, విశాఖ మీదుగా ఉత్తర భారతమంతా ప్రయాణిస్తుందని తెలిపారు. ఉత్తర భారత యాత్ర ప్యాకేజీ 9 రోజులు, 9 రాత్రులు…
రైళ్లలో ప్రయాణం చేసేవారి భద్రత విషయంలో రైల్వేశాఖకు అనేక ఫిర్యాదులు అందుతుండటంతో కొత్త నిబంధనలను అమలులోకి తీసుకొచ్చింది. రైళ్లలో ప్రయాణం చేసే తోటి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించినా వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించాలని నిర్ణయం తీసుకుంది. ఈ బాధ్యతలను ఆర్పీఎఫ్‌కు అప్పగిస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. రైళ్లలో ప్రయాణం చేసే సమయంలో బోగీల్లో ల్యాప్‌ట్యాప్, మొబైల్‌ఫోన్‌లలో పెద్దగా శబ్దం వచ్చేలా పాటలు వంటివి పెట్టకూడదు. ఫోన్‌లో బిగ్గరగా మాట్లాడరాదు. సాధారణ తరగతుల్లోప్రయాణం చేసే…