Changes in Vande Bharat Express: దూర ప్రాంతాలకు చేరేందుకు నేటికి చాలా మంది సామాన్యుల ప్రయాణ సాధనం రైళ్లు. అయితే గతంతో పోలిస్తే భారత రైల్వే వ్యవస్థలో అనేక మార్పులు సంతరించుకున్నారు. ప్రయాణీకులు సౌకర్యార్థం అనేక మార్పులు చేశారు. ప్రస్తుతానికి వేగవంతంగా, సురక్షితంగా ప్రయాణించే వందే భారత్ ఎక్స్ ప్రెస్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా ప్రయాణ సమయం చాలా వరకు తగ్గిపోతుంది. అది వరకు పట్టే సమయంలో సగం మాత్రమే పడుతుంది. అయితే ఈ రైళ్లలో ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేయడానికి రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం ఉన్న వాటిలో 25 మార్పులు వరకు చేసింది.
Also Read: Norman Borlaug Award: ఒడిశా యువతికి నార్మన్ బోర్లాగ్ అవార్డ్
ఎనిమిది గంటల పాటు కూర్చుని ప్రయాణం చేయాల్సి రావడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారన్న భావనతోనే ఈ మార్పులు చేసినట్లు అధికారులు పేర్కొ్న్నారు. సీట్లు మరింత వెనక్కు వెళ్లేలా పుష్ బ్యాక్ లో మార్పులు చేశారు. దీని ద్వారా నిద్రపోయేందుకు ఎక్కువ వెనక్కు వాలే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సీట్ల మెత్తదనాన్ని కూడా పెంచారు. మరుగుదొడ్లలో ఎక్కువ వెలుతురు వచ్చేలా చేశారు. మొబైల్ చార్జింగ్ పాయింట్, ఫుట్‌రెస్ట్‌లోనూ సౌకర్యవంతంగా ఉండేలా మార్పులు చేశారు. ఏసీ మరింత సమర్థవంతంగా పనిచేసేలా కూడా రైల్వే శాఖ మార్పులు చేసింది. ఇక ఈ నెల 24న ప్రధాని మోడీ చేతుల మీదుగా 9 వందే భారత్ రైళ్లు ప్రారంభం కానున్నాయి.రాజస్థాన్, మధ్యప్రదేశ్‌తో సహా కేరళ, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ఒకే రోజు రికార్డు స్థాయిలో తొమ్మిది రైళ్లను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. వీటిని వర్చువల్ పద్దతిలో ఆయన ప్రారంభిస్తారు. ఈ సర్వీసులతో కలిసి దేశంలో మొత్తం వందే భారత్ ఎక్స్ ప్రెస్ సర్వీసులు 34కు చేరునున్నాయి. అలాగే భవిష్యత్తుల్లో మరో 10 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను సిద్ధం చేయాలన్న ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న వందే భారత్ రైళ్ల రంగు నీలం కాకుండా ఇవి ఆరెంజ్ కలర్ లో కనిపించనున్నాయి.