Reel On Track: రీల్స్ పిచ్చి యువత ప్రాణాలను తీస్తోంది. సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించాలని, వ్యూస్, సబ్‌స్క్రైబర్లను పెంచుకోవాలనే పిచ్చి కోసం ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ 15 ఏళ్ల బాలుడు కూడా ఇదే విధంగా మరణించాడు. ఒడిశాలోని పూరిలోని రైల్వే ట్రాక్‌పై రీల్ షూట్ చేస్తున్న సమయంలో రైలు ఢీకొని మరణించాడు.
జార్ఖండ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రైలు ఢీకొని మూడు ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయి. ఆగ్నేయ రైల్వే ఖరగ్‌పూర్ డివిజన్‌లోని సర్దిహా జార్గ్రామ్ సెక్షన్‌లోని 143 కిలోమీటరు వద్ద స్తంభం నంబర్ 11/13 మధ్య రైల్వే ట్రాక్ దాటుతున్న మూడు ఏనుగులను రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మూడు ఏనుగులు అక్కడికక్కడే చనిపోయాయి. మృతిచెందిన ఏనుగుల్లో ఒక పెద్ద ఏనుగు ఉండగా, రెండు పిల్ల ఏనుగులు ఉన్నాయి. ఈ సంఘటన రాత్రి 12:50 గంటలకు జరిగింది. Also Read:Tirumala…
బీహార్‌లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కతిహార్ బరౌని రైల్వే సెక్షన్‌లోని కధగోలా, సేమాపూర్ మధ్య మహారాణి గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బరౌని నుంచి కతిహార్‌కి వస్తున్న 15910 అవధ్ అస్సాం ఎక్స్‌ప్రెస్ రైలు.. రైల్వే ట్రాలీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక ట్రాలీమ్యాన్ అక్కడికక్కడే మరణించాడు. నలుగురు రైల్వే కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ తొక్కిసలాటపై రైల్వే శాఖ ఉన్నత స్థాయి కమిటీ వేసింది. ఉన్నత స్థాయి కమిటీలో నార్త్ రైల్వేస్ ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ నర్సింగ్ దేవ్, ప్రిన్సిపల్ చీఫ్ సేఫ్టీ కమిషనర్ పంకజ్ గంగ్వార్‌లు ఉన్నారు. కాగా.. ఈ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ విచారణ ప్రారంభించింది.
Mahakumbh 2025 : మహా కుంభమేళాకు సంబంధించి ఆర్జేడీ అధినేత, మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. కుంభమేళా పనికిరానిదని, దానికి అర్థం లేదని ఆయన అన్నారు.
Delhi : శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మరణించారు. తొక్కిసలాటలో మరణించిన వారిలో 9 మంది మహిళలు, ఐదుగురు పిల్లలు, నలుగురు పురుషులు ఉన్నారు.
Delhi Stampede : న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన ప్రమాదానికి సంబంధించి, ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హిమాన్షు ఉపాధ్యాయ్ ప్రమాదానికి గల ప్రాథమిక కారణాన్ని వివరించారు.
Delhi Stampede : న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ సంఘటన వల్ల ప్రభావితమైన ప్రజలకు పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల రూపాయల పరిహారం ఇస్తుంది.
సూరత్ జిల్లాలో రైల్వే ట్రాక్‌ల ట్యాంపరింగ్ కేసు బట్టబయలైంది. విచారణలో ముగ్గురు రైల్వే ఉద్యోగులు విధ్వంసానికి సంబంధించిన మొత్తం కథను రూపొందించారని తేలింది.