Train Accident : బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం.. నలుగురు మృతి.. 200 మందికి గాయాలు
- బెంగాల్లో ప్యాసింజర్ రైలును ఢీకొట్టిన గూడ్స్ రైలు
- నలుగురు మృతి..200మందికి పైగా గాయాలు
- కొనసాగుతున్న సహాయక చర్యలు
- మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Train Accident : పశ్చిమ బెంగాల్‌లోని న్యూ జల్‌పైగురిలో రైలు ప్రమాదం జరిగింది. ఇక్కడ కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. దాదాపు 200 మంది ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ సీల్దా వైపు వెళుతోంది. అంతలో వెనుక నుంచి గూడ్స్ రైలు ఢీకొంది. దీంతో ప్యాసింజర్ రైలులోని మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదంలో ఇంకా చాలా మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
#WATCH | Kanchenjunga Express train rammed by a goods train at Ruidhasa in Darjeeling district of West Bengal; Police team present at the spot, rescue work underway pic.twitter.com/Y3UsbzPTxs
Also Read
— ANI (@ANI) June 17, 2024
Read Also:Elon Musk: మస్క్ పేల్చిన ఈవీఎం బాంబ్.. భారత్ లో పేలిందిగా?(వీడియో)
కతిహార్ డివిజన్‌లోని రంగపాణి-నిజ్‌బారి స్టేషన్‌ల మధ్య స్టేషన్‌లో నిలబడిన కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పాయి. తోపు బలంగా ఉండడంతో ఒక బోగీ మరో బోగీపైకి ఎక్కింది. ఈ ఘటన సమాచారంతో కతిహార్ రైల్వే డివిజన్‌లో కలకలం రేగింది. రైల్వే అధికారులు సహాయ రైలు, మెడికల్ వ్యాన్‌తో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనలో నలుగురు చనిపోగా.. 200 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఈ ఘటనలో ఇంకెంత మంది చనిపోయారో అధికారికంగా ధృవీకరించలేదు. కాని సంఘటన స్థలం నుండి వీడియో వైరల్ అవుతోంది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య స్పష్టంగా తెలియరాలేదు.
Read Also:Jammu Kashmir: జమ్మూకశ్మీర్లో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు.. ఒకరు హతం
Shocked to learn, just now, about a tragic train accident, in Phansidewa area of Darjeeling district. While details are awaited, Kanchenjunga Express has reportedly been hit by a goods train. DM, SP, doctors, ambulances and disaster teams have been rushed to the site for rescue,…
— Mamata Banerjee (@MamataOfficial) June 17, 2024
ఈ ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. డార్జిలింగ్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాద వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. కంజన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను వెనుక నుంచి గూడ్స్ రైలు ఢీకొన్నట్లు సమాచారం. జిల్లా మేజిస్ట్రేట్, వైద్యులు, అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!