Delhi Stampede : న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన ప్రమాదానికి సంబంధించి, ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హిమాన్షు ఉపాధ్యాయ్ ప్రమాదానికి గల ప్రాథమిక కారణాన్ని వివరించారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఈ విషాద సంఘటన జరిగినప్పుడు పాట్నా వైపు వెళ్తున్న మగధ ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫామ్ నంబర్ 14పై నిలబడి ఉందని, జమ్మూ వైపు వెళ్తున్న ఉత్తర సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫామ్ నంబర్ 15పై నిలబడి ఉందని ఆయన అన్నారు. ఈ సమయంలో ఒక ప్రయాణీకుడు 14, 15 ప్లాట్‌ఫారమ్ నంబర్ మధ్య మెట్లపై జారి పడిపోయాడు. అతని వెనుక ఉన్న చాలా మంది ప్రయాణికులు అతనితో పాటు పడిపోవడంతో ఈ విషాద సంఘటన జరిగింది. ఈ ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీ దర్యాప్తు చేస్తోంది. రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మరణించగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఉన్న పోర్టర్ ఏం చెప్పాడు?
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటపై, రైల్వే స్టేషన్‌లోని ఒక పోర్టర్ మాట్లాడుతూ.. నేను 1981 నుండి పోర్టర్‌గా పనిచేస్తున్నానని, కానీ ఇంతకు ముందు ఎప్పుడూ ఇంత జనసమూహాన్ని చూడలేదని అన్నారు. ప్రయాగ్‌రాజ్ స్పెషల్ 12వ నంబర్ ప్లాట్‌ఫామ్ నుండి బయలుదేరాల్సి ఉంది. కానీ దానిని 16వ నంబర్ ప్లాట్‌ఫామ్‌కు మార్చారు. 12వ ప్లాట్‌ఫారమ్‌పై వేచి ఉన్న జనం, బయట వేచి ఉన్న జనం 16వ ప్లాట్‌ఫారమ్‌కు వెళ్లేందుకు ప్రయత్నించారు. ప్రజలు తోసుకుని ఎస్కలేటర్లు, మెట్లపై పడిపోయారు.
Read Also : SangaReddy: కూతురిని ప్రేమిస్తున్నాడని యువకుడిని హత్య చేసిన తండ్రి
#WATCH | Stampede at New Delhi railway station | A porter (coolie) at the railway station says "I have been working as a coolie since 1981, but I never saw a crowd like this before. Prayagraj Special was supposed to leave from platform number 12, but it was shifted to platform… pic.twitter.com/cn2S7RjsdO
— ANI (@ANI) February 16, 2025
జనసమూహాన్ని ఆపడానికి చాలా మంది పోర్టర్లు అక్కడ గుమిగూడారు. మృతదేహాలను అంబులెన్స్‌లో పంపించారు. ప్లాట్‌ఫారమ్‌పై బూట్లు, బట్టలు మాత్రమే మిగిలి ఉన్నాయి. 12వ ప్లాట్‌ఫారమ్‌పై వేచి ఉన్న జనం, బయటి నుండి వచ్చిన జనం 16వ ప్లాట్‌ఫారమ్‌కు చేరుకోవడానికి ప్రయత్నించినప్పుడు, ప్రజలు తోసుకుని ఎస్కలేటర్లు, మెట్లపై పడిపోయారు. పోలీసులను, అగ్నిమాపక సిబ్బందిని, 3-4 అంబులెన్స్‌లను అక్కడికి పిలిచాన్నారు. ప్రజలను ఆసుపత్రికి తరలించారు.
సంఘటన స్థలంలో ఉన్న వ్యక్తుల ప్రకారం.. స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు వాటి షెడ్యూల్ సమయం కంటే ఆలస్యంగా నడుస్తున్నాయి. దీని కారణంగా ఈ రైలులో ప్రయాణించే వ్యక్తులు ప్లాట్‌ఫారమ్ నంబర్ 12-13 వద్ద చిక్కుకుపోయారు. జనసమూహం చాలా ఎక్కువగా ఉండటంతో, ప్రజలు ప్లాట్‌ఫారమ్‌పైనే కాకుండా మెట్లపై కూడా రైలు వచ్చేందుకు వేచి ఉన్నారు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫామ్ నంబర్ 15 వద్దకు చేరుకుంది. రెండు చోట్లా జనం ఒకేసారి పెరగడంతో ఈ ప్రమాదం జరిగింది.