150 ఏళ్ళ చరిత్ర కలిగింది కాంగ్రెస్ పార్టీ. స్వాతంత్ర్య సంగ్రామాన్ని నడిపి అనంతరం దేశాన్ని దశాబ్దాల పాటు ఏకచత్రాధిపత్యంగా ఏలిన పార్టీ. ఇప్పుడు దాని ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. జాతీయ స్థాయితో పాటు తెలంగాణలోనూ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. దీనికి ప్రధాన కారణం గ్రూపు రాజకీయాలు. నాయకులు తమకు తాము అధినేతలుగా భావిస్తూ.. వర్గ రాజకీయాలను పెంచుకుంటూ పోతున్నారు. ఆంధ్రలో పార్టీని త్యాగం చేసి మరీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో నాయకుల వైఫల్యం వలన అధికారంలోకి రావాల్సింది…
తెలంగాణ రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ అలుపెరుగని పోరాటం చేస్తోందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీబచేసిన ట్వీట్ పై టీఆర్‌ఎస్ నేతలు పోటీ పడి కామెంట్స్ చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా చేసిన సూచనలు పరిగణలోకి తీసుకుంటారని భావించాం. కేటీఆర్ ఎదురు దాడి చేస్తున్నారు. కాంగ్రెస్ గురించి, ఈ దేశం గురించి కేటీఆర్ కు అవగాహన లేదు. దేశానికి కాంగ్రెస్ ఏం చేసిందో చెప్తున్నా, నిజమో కాదో, తండ్రి కేసీఆర్ ను అడిగి కేటీఆర్ తెలుసుకోవాలి.…