Parliament: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు నేడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ తరఫున గౌరవ్ గొగోయ్, ప్రమోద్ తివారీ హాజరుకానున్నారు.
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌గాంధీని కలవలేకే తన తండ్రి రామ్‌విలాస్ పాశ్వాన్ యూపీఏ నుంచి బయటకు వచ్చేశారని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ ప్రాక్టికల్ పార్టీ.. కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రుణమాఫీ చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. సోనియా గాంధీ, రాహూల్ బటన్ నొక్కితే సీఎం రేవంత్ రుణమాఫీ చేశారన్నారు. సినిమాల్లో రైతుల గురించి చూపించి డబ్బులు సంపాదించిన చిరంజీవి.. నల్ల చట్టాల గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. నల్ల చట్టాలు తెచ్చిన మోడీకి మద్దతు ఇచ్చి.. రైతులకు అండగా ఉన్న రాహుల్ గాంధీకి మద్దతు ఎందుకు ఇవ్వలేదని అన్నారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ హింసను ప్రేరేపిస్తోందని బీజేపీ ఆరోపించింది. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని ‘హత్య’, ‘హింస’ అనే పదాలను ఉపయోగించరాని పేర్కొంది. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే, ఇటీవల డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నాన్ని ప్రస్తావిస్తూ.. స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు హింసను ప్రేరేపిస్తుందని మాజీ ఐపీఎస్ అధికారి రాసిన లేఖను బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది హైలెట్ చేశారు.
Rahul Gandhi: జమ్మూ కాశ్మీర్ దోడా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు జవాన్లు మరణించడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. వారికి నివాళులు అర్పించిన రాహుల్, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
BJP: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ప్రధాని నరేంద్రమోడీ ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని అన్నారు.
దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ బైపోల్స్ ఫలితాల్లో ఇండియా కూటమి ఘన విజయం సాధించింది. ఈ మేరకు కూటమి నేతలంతా సంబరాలు చేసుకున్నారు. ఇక ఈ ఫలితాలపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తనదైన శైలిలో స్పందించారు
Rahul Gandhi-Kamala Harris: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ గురువారం ఫోన్లో మాట్లాడుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Rahul Gandhi: మాజీ కేంద్రమంత్రి స్మృతీ ఇరానీపై అవమానకరమైన పదజాలం, అసహ్యంగా మాట్లాడటం మానుకోవాలని ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన మద్దతుదారులకు, కాంగ్రెస్ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ప్రజలను అవమానించడం బలహీనకు సంకేతమని, బలం కాదని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.