Rahul Gandhi: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన పార్లమెంటు సభ్యత్వం తిరస్కరణతో సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. సామాన్యులను కలుసుకునేందుకు, వారి సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. అతడుఈ మధ్య ట్రక్ డ్రైవర్ల జీవితాలను దగ్గరి నుండి తెలుసుకున్నారు.
దేశానికి ప్రధాన మంత్రి ఎవరైనా సరే, వాళ్లు కచ్చితంగా భార్యతో ఉండాలని రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ షరతు పెట్టారు. అయితే ఇది ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఉద్దేశించి అన్నారా లేదంటే రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి.
మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ గందరగోళం ఇప్పుడు ఢిల్లీకి చేరింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో చీలిక తర్వాత జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ ఢిల్లీలో కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎనిమిది తీర్మానాలను ఆమోదించారు. ఇందులో అజిత్ పవార్ సహా 9 మందిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మీటింగ్ తర్వాత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శరద్ పవార్‌ను కలిశారు.
కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యుఐ) ఇన్‌ఛార్జ్‌గా కన్హయ్య కుమార్‌ను కాంగ్రెస్ ఇవాళ (గురువారం) నియమించింది. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ విద్యార్థి విభాగానికి కన్హయ్య కుమార్ నాయకత్వం వహించడానికి కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది.
Harish Rao: అది నోరా.. మొరా.. మీకు మొక్కాలి అంటూ రాహుల్ గాంధీపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. సిద్ధిపేట నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి హరీశ్ రావు పర్యటించారు. సిద్దిపేటలోని పత్తి మార్కెట్ యార్డులో రైతులకు స్పింక్లర్లను మంత్రి హరీశ్ రావు పంపిణీ చేసారు.
Rahul Gandhi: కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జూలై 4వ తేదీ మంగళవారం రాంచీలోని ఎంపీ..ఎమ్మెల్యే కోర్టుకు హాజరుకానున్నారు. అనంతరం ఈరోజే పాట్నా హైకోర్టులో ఆయనపై విచారణ జరగనుంది. 'మోడీ ఇంటిపేరు' వ్యాఖ్యకు సంబంధించి ఎంపీ-ఎమ్మెల్యే రెండు కోర్టుల్లోనూ ఆయనపై దాఖలైన పరువు నష్టం కేసుల విచారణ కొనసాగుతోంది.
Telangana Congress: టీ కాంగ్రెస్ మరో కీలక కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. యువత ఓటర్లను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేపట్టాలని నిర్ణయించింది. ఈ యాత్ర రేపటి నుంచి (ఈ నెల 5) నుంచి అంటే ప్రారంభం కానుంది.