Rahul Gandhi: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. సోమవారం సమావేశాలు ప్రారంభమయ్యే ముందు లోక్‌సభ సెక్రటేరియట్ దాని నోటీసును జారీ చేసింది.
ప్రతిపక్ష కూటమి 'ఇండియా' మూడో సమావేశం ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీలలో ముంబైలో జరుగుతుందని కాంగ్రెస్, శివసేనకు చెందిన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఈరోజు ప్రకటించాయి. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎంపీ హోదాను పునరుద్ధరించడానికి సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసిన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన వచ్చింది.
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే, వాళ్లిద్దరూ లోపాయికరిగా కలిసి పని చేస్తున్నారు. అసెంబ్లీ పరిధిలో కూడా ఒక ప్రత్యేక ప్రణాళికతో అక్కడి సమస్యలపై పోరాడాలి అని ఠాక్రే అన్నారు.
రాహుల్ గాంధీ పరువు నష్టం కేసులో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. తుది తీర్పులో కూడా సరైన నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మోడీ ఇంటి పేరు పరువు నష్టం దావా కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
ఈరోజు దేశంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్ రాహూల్ గాంధీ అనర్హత వేటు విషయంలో స్టే ఇవ్వడం ఒక చారిత్రాత్మక ఘట్టంగా మేము భావిస్తున్నామని మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు.
రువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి భారీ ఊరట లభించింది. ఆయన దోషి అని సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నిలిపివేసింది. దీంతో రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
భారతీయ మార్కెట్లలో టమాటా ధరలు మండిపోతుండగా.. ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మార్కెట్లో కూరగాయల విక్రయదారుడు కన్నీళ్లు పెట్టిన వీడియో సామాన్య ప్రజలను కూరగాయల ద్రవ్యోల్బణం ఎంత తీవ్రంగా దెబ్బతీస్తుందో వెలుగులోకి తెచ్చింది.