కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి పార్లమెంటరీ సభ్యత్వం పునరుద్ధరణ తర్వాత ఢిల్లీలోని 12 తుగ్లక్ లేన్ బంగ్లాను తిరిగి కేటాయించినట్లు వర్గాలు మంగళవారం తెలిపాయి. ఎంపీగా అనర్హత వేటు పడటంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో బంగ్లాను ఖాళీ చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాందీ ఆగస్టు 12, 13 తేదీల్లో వయనాడ్‌లో పర్యటిస్తారని, ఎంపీగా తిరిగి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి తన నియోజకవర్గానికి పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం వెల్లడించారు. ఇది తిరిగి ఎంపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మొట్టమొదటి పర్యటన.
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఇవాళ (మంగళవారం) లోక్‌సభలో చర్చ ప్రారంభం కానుంది. లోక్‌సభలో ఈ చర్చను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రారంభిస్తారని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రాహుల్ గాంధీ లోక్‌సభలో మాట్లాడనున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై రేపు పార్లమెంటులో చర్చ జరగనుంది. చర్చను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభిస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి.
Sherlyn Chopra: షెర్లిన్ చోప్రా.. ఈ పేరు వినని వారుండరు. గతేడాది శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల కేసులో ఆమె కూడా ఒక నిందితురాలిగా ఉంది. రాజ్ కుంద్రా నిజ స్వరూపాన్ని బయటపెట్టి సోషల్ మీడియాను షేక్ చేసింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ తర్వాత తన ట్విట్టర్ బయోను"మెంబర్ ఆఫ్ పార్లమెంట్"గా మార్చారు. మోడీ ఇంటిపేరుపై వ్యాఖ్యలకు సంబంధించి ఆయనపై దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసుపై దిగువ సభ నుంచి సస్పెన్షన్‌కు గురైన తర్వాత రాహుల్‌గాంధీ బయో గతంలో "డిస్ క్వాలిఫైడ్ ఎంపీ" అని ఉండేది.
Rahul Gandhi: నాలుగు నెలల తర్వాత కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మళ్లీ పార్లమెంటుకు వచ్చారు. మోడీ ఇంటిపేరు కేసులో ఆయనకు రెండేళ్ల శిక్ష పడింది. ఆ తర్వాత పార్లమెంటు సభ్యత్వం లాగేసుకున్నారు.