పార్లమెంట్ లో రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరు మహిళల పట్ల వారికి గల చిన్న చూపుకు నిదర్శనమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరు పట్ల బుధవారం సాయంత్రం ఆమే పత్రిక ప్రకటన విడుదల చేసింది.
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన విషయాన్ని రాహుల్ గాంధీ పార్లమెంట్ లో తెలిపారు. భారత్ జోడో యాత్ర ఇంకా ముగియలేదన్నారు. లడ్డాఖ్ వరకు తాను యాత్ర చేస్తానని ఆయన ప్రకటించారు.
మీరు మణిపూర్లో భారత మాతను చంపేశారు.. మీరు దేశభక్తులు కాదు, దేశ ద్రోహలు.. మణిపూర్ను రెండు భాగాలుగా విభజించారు.. మోడీకి ఈ దేశ గుండె చప్పుడు వినే సమయం లేదు.. మోడీ కేవలం అమిత్ షా, అదానీ మాటలే వింటారు అంటూ రాహుల్ గాంధీ అన్నారు.
ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంటులో ఓటు వేసినందుకు, ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సహా విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో రెండో రోజు చర్చ జరుగుతుంది. మణిపూర్ హింసతో పాటు పలు అంశాలపై తీర్మానంపై చర్చ సందర్భంగా విపక్ష సభ్యులు కేంద్రాన్ని నిలదీయనున్నారు.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తొలి దశకు విశేష స్పందన లభించిన తర్వాత, ఇప్పుడు గుజరాత్ నుంచి మేఘాలయ వరకు రెండో దశను ప్లాన్ చేసినట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే మంగళవారం తెలిపారు.
Mallikarjun Kharge: ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ నెల 18న తెలంగాణలో పర్యటించనున్నారు. పార్లమెంట్ సమావేశాలు పూర్తయిన తర్వాత ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో ఆయన పర్యటించనున్నారు.