Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంట్ హౌసింగ్ కమిటీకి లేఖ రాశారు. గతంలో తనకు కేటాయించిన బంగ్లా తనకు వద్దని లేకలో పేర్కొన్నారు. గతంలో తనకు కేటాయించిన బంగ్లాను రాహుల్ గాంధీ వద్దని చెప్పడంతో మరోక బంగ్లా కోరుకోవాలని హౌసింగ్ కమిటీ సూచించింది. మోడీ ఇంటిపేరు కేసులో తన పార్లమెంటు సభ్యత్వం కోల్పోయిన రాహుల్ గాంధీ.. సుప్రీం కోర్టు తీర్పుతో తిరిగి పార్లమెంట్ సభ్వత్యం పునరుద్దరించబడటంతో.. గతంలో రాహుల్‌కు కేటాయించిన బంగ్లానే తిరిగి రాహుల్ గాంధీకి కేటాయిస్తున్నట్టు పార్లమెంట్ హౌసింగ్ కమిటీ తెలిపింది. అయితే గతంలో తాను నివసించిన బంగ్లాకు వెళ్లేందుకు ఎంపీ రాహుల్ అయిష్టతను వ్యక్తం చేశారు. ఈ మేరకు పార్లమెంటరీ హౌసింగ్ కమిటీకి ఆయన లేఖ రాసినట్లు పార్టీ వర్గాలు గురువారం వెల్లడించాయి.
Read Also: Tamil Cinema: ఈ సినిమాలకి నేషనల్ అవార్డ్స్ రావాల్సింది…
పరువునష్టం కేసులో రాహుల్‌కు సూరత్ కోర్టు 2 ఏళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో లోక్‌సభ సచివాలయం ఆయనపై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. అనంతరం నిబంధనల మేరకు ఢిల్లీలోని 12-తుగ్లక్ లేన్‌లోని అధికారిక బంగ్లాను గత ఏప్రిల్‌లో రాహుల్ ఖాళీ చేశారు. తన ఎంపీ బంగ్లాను ఖాళీ చేసిన రాహుల్ గాంధీ 10 జన్‌పథ్‌లోని తన తల్లి సోనియా గాంధీ నివాసానికి మారారు. రాహుల్ శిక్షపై సుప్రీంకోర్టు ఇటీవల స్టే విధించడంతో ఆయన ఎంపీ సభ్యత్వాన్ని లోక్‌సభ సచివాలయం తిరిగి పునరుద్ధరించింది. ఈ నేపథ్యంలో 12-తుగ్లక్ లేన్‌లోని బంగ్లాను తిరిగి ఆయనకే కేటాయించారు. దీనిపై తన సమ్మతి తెలియజేసేందుకు 15 రోజుల గడువు ఇచ్చారు. బుధవారంతో గడువు ముగిసింది. అయితే గడువు కంటే ముందే రాహుల్ పార్లమెంట్ హౌసింగ్ కమిటీకి లేఖ రాశారు. దీంతో పార్లమెంటరీ హౌసింగ్ కమిటీ ఆయన్ను 7 సఫ్దార్‌గంజ్ లేన్ లేదా 3 సౌత్ అవెన్యూ బంగ్లాలను ఎంచుకోవచ్చని సూచించింది. రాహుల్ వ్యక్తిగత భద్రతా బృందం ఆ రెండింటిని పరిశీలిస్తున్నారు. రెండింటిలో ఏది రాహుల్ గాంధీకి అనుకూలంగా ఉంటుందనేది ఆలోచించిన అనంతరం వారు హౌసింగ్ కమిటీకి తన సమ్మతిని రాహుల్ గాంధీ తెలపనున్నారు. రాహుల్ గాంధీ నిర్ణయం అనంతరం పార్లమెంట్ హౌసింగ్ కమిటీ ఆయనకు బంగ్లాను కేటాయించనుంది.