కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఓట్ల చోరీ ఆరోపణలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిప్పికొట్టారు. కాంగ్రెస్ చొరబాటుదారులను కాపాడుతోందని తిప్పికొట్టారు. బీహార్‌లోని డెహ్రీలో షహాబాద్, మగధ్ ప్రాంతాలకు చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్ర చేయనున్నారు. ఇప్పటికే భారత్ జోడో పేరుతో రెండు యాత్రలు చేసి దేశం చుట్టి వచ్చారు. ఇక ఆదివారం నుంచి 16 రోజుల పాటు బీహార్ లో ఓటర్ అధికార్ యాత్ర చేయనున్నారు. ఓటర్ అధికార్ యాత్రలో బీహార్ లోని ఆర్జేడీ కీలక నేత తేజస్వీ యాదవ్ తో పాటు ఇండియా కూటమి నేతలు పాల్గొంటారు.