BJP: భారత ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. కొలంబియాలోని ఒక యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడుతూ.. భారత్‌లో ప్రజాస్వామ్యంపై అన్ని వైపుల నుంచి దాడి జరుగుతోందని ఆయన అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనిపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ఆయన అవమానకరమని అన్నారు. విదేశీ గడ్డపై భారతదేశాన్ని అప్రతిష్టపాటు చేయడానికి మరోసారి కాంగ్రెస్ ఎంపీ ప్రయత్నించారని కంగనా ఆరోపించారు.…
Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విదేశాల్లో భారత ప్రజాస్వామ్యంపై విమర్శలు చేశారు. కొలంబియాలోని ఈఐఏ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యార్థులతో మాట్లాడుతూ..ప్రజాస్వామ్యంపై దాడి భారత్‌కు అతిపెద్ద ముప్పు అని అన్నారు. భారత్‌లో అనేక మతాలు, సంప్రదాయాలు, భాషలు ఉన్నాయని, ప్రజాస్వామ్య విధానం అందరికి స్థానం కల్పిస్తుందని, కానీ ప్రస్తుతం ప్రజాస్వామ్య వ్యవస్థపై అన్ని రకాలుగా దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.