ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ టెస్టుల్లో సెంచరీల పరంపర కొనసాగిస్తున్నాడు. ఇటీవల అతను నాలుగు సెంచరీలు సాధించాడు. గత 8 ప్రొఫెషనల్ మ్యాచ్‌లను కూడా కలుపుకుంటే అతను మొత్తం 5 సెంచరీలు సాధించాడు. వాటిలో ఒకటి టీ20 లీగ్‌లో జరిగింది. తాజాగా.. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో స్మిత్ సెంచరీ సాధించి అనేక రికార్డులు సాధించాడు. స్టీవ్ స్మిత్ 191 బంతుల్లో సెంచరీ చేశాడు. ఇది అతని టెస్ట్ క్రికెట్‌లో 36వ సెంచరీ.
భారత మాజీ కెప్టెన్, మాజీ హెడ్ కోచ్, టీ20 ప్రపంచ కప్ 2024 విజేత జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. రాహుల్ ద్రవిడ్ ప్రయాణిస్తు్న్న కారును ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం తెలియగానే ఫ్యాన్స్ ఆందోళన చెందారు. అయితే ఈ ప్రమాదంలో రాహుల్ ద్రవిడ్ కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా ఈ ప్రమాదం అనంతరం ద్రవిడ్ ఆటో…
Venkatesh Prasad: టీమిండియా మాజీ సెలెక్టర్, కోచ్ వెంకటేష్ ప్రసాద్ ఆదివారం తన టాప్-5 భారతీయ క్రికెటర్ల జాబితాను తాజాగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ జాబితాలో అతను ఆధునిక క్రికెట్ దిగ్గజాలుగా చెప్పుకునే విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ, ధోనీ (MS Dhoni), జస్ప్రీత్ బుమ్రా (Bumrah) వంటి ఆటగాళ్లను చేర్చలేకపోయాడు. ఈ జాబితాను ప్రసాద్ సోషల్ మీడియా వేదికగా జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఆయన వెల్లడించారు. వెంకటేష్ ప్రసాద్ తన…
ఆస్ట్రేలియా చేతిలో సిరీస్ 3-1తో ఓడిపోవడంతో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. భారత మాజీలు కూడా గంభీర్‌పై మండిపడుతున్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ ఘాటుగా స్పందించాడు. గంభీర్ చేసే పనులకు.. చెప్పే మాటలకు పొంతన ఉండదన్నారు. ప్రధాన కోచ్‌గా ఉన్నపుడు భారత్‌కు చెందిన వారిని సహాయక కోచ్‌లుగా తీసుకోవచ్చు కదా? అని ప్రశ్నించారు. 2015 రంజీ ట్రోఫీ సమయంలో తనకు, గంభీర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు…
బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాకు చెందిన వైభవ్ సూర్యవంశీ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ రూ. 1 కోటి 10 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలోనే అమ్ముడైన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ నిలిచాడు.
భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గురించి కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గౌతీ ఎవరికీ తలవంచే రకం కాదన్నాడు. ఏ పరిస్థితుల్లో అయినా చివరి వరకూ పోరాడాలనే బలంగా భావిస్తాడన్నాడు. ప్రస్తుతం భారత క్రికెట్ డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం చాలా బాగుందని రోహిత్ పేర్కొన్నాడు. మొన్నటివరకు రాహుల్ ద్రవిడ్‌తో కలిసి పనిచేసిన హిట్‌మ్యాన్.. ఇప్పుడు గంభీర్‌తో కలిసి జట్టును నడిపిస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా జియో…
టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్.. పదవీకాలం ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్ ఎన్నికైన విషయం తెలుసు. అయితే.. ప్రస్తుతం ఖాళీగా ఉన్న రాహుల్ ద్రవిడ్ రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్‌గా సెలక్ట్ అయ్యాడు. ఈ విషయాన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ శుక్రవారం ప్రకటించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భారత జట్టు మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు మళ్లీ కోచ్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ (RR)కి ప్రధాన కోచ్ గా నియమితులయ్యారు. ఈ ఏడాది జూన్‌లో టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు రాహుల్ ద్రవిడ్ ప్రధాన కోచ్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆయన తర్వాత గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు.
Samit Dravid: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, కోచ్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ ఆస్ట్రేలియాతో జరగబోయే అండర్-19 సిరీస్ లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. 18 ఏళ్ల ఆల్ రౌండర్ వన్డే, 2 నాలుగు రోజుల మ్యాచ్ లు ఆడబోయే జట్లలో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ ఎంపిక దేశీయ స్థాయిలో సమిత్ అద్భుతమైన ప్రదర్శన తర్వాత వచ్చింది. దేశీయ స్థాయిలో అతను స్థిరంగా పరుగులు సాధించాడు. అండర్-19 ఈ సిరీస్ లో…
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన మూడో ఆటగాడిగా రూట్ రికార్డుల్లో నిలిచాడు. శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా మాంచెస్టర్ వేదికగా జరిగిన మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్ రూట్ హాఫ్ సెంచరీ (62 నాటౌట్; 128 బంతుల్లో, 2 ఫోర్లు) చేసి.. ఈ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ రికార్డును బ్రేక్ చేశాడు.…