రఘురామ కృష్ణంరాజు ప్రభుత్వాన్ని అస్థిరపరచటానికి కుట్ర పన్నారు. గత ఏడాది కాలంగా ఢిల్లీలో కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ ల పేరుతో కులాల మధ్య విద్వేషాలు తీసుకుని వచ్చే ప్రయత్నం చేశారు అని ఎన్టీవీతో వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. పైకి రఘురామ కృష్ణంరాజు ఉన్నా వెనుక చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, కొన్ని ఛానల్స్ ఉన్నాయి అని పేర్కొన్నారు. ఏడాది కిందటే ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయమని లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశాం…
నర్సాపురం ఎంపీ, వైసీపీ రెబల్ నేత రఘురామకృష్ణంరాజును గుంటూరు జిల్లా జైలుకు తరలించారు సీఐడీ అధికారులు.. ఈ నేపథ్యంలో జైలు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వైద్య పరీక్షలు ముగిసిన వెంటనే ఆయనను జీజీహెచ్ నుంచి నేరుగా జిల్లా కేంద్ర జైలుకు తరలించారు.. ఇక, ఆయనకు సీఐడీ ప్రత్యేక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. మరోవైపు రఘురామ కృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితిపై జిల్లా కోర్టు నుంచి వైద్య బృందం నివేదిక…
రఘురామకృష్ణంరాజు నరసాపురం ఎంపీగా గెలిచారంటే అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెట్టిన భిక్ష. ముఖ్యమంత్రి జగన్ దయతోను, ఆయన పెట్టిన బిక్షతోనూ ఎంపీగా గెలుపొంది పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం కరెక్ట్ కాదు అని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. మాట్లాడే భాష, తీరు, వ్యవహరించే విధానం ప్రజాప్రతినిధికి ఉండాల్సిన లక్షణం ఒక్కటీ ఆయనకు లేదు. ఎంపీగా గెలిచి రెండేళ్లు కావొస్తున్నా ఆయన ప్రజలకోసం చేసిందేమీ లేదు. కరోనా సమయంలో…
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది… నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుకు బెయిలు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. కులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ శుక్రవారం హైదరాబాద్ లో ఏపీ సీఐడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే కాగా… బెయిల్ కోసం రఘురామకృష్ణం రాజు పెట్టుకున్న హౌస్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే, ఆయన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేయడంతో ఆయనకు…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు అరెస్ట్ వ్యవహారంలో ఏపీ రాజకీయాలతో పాటు తెలంగాణ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్‌గా మారాయి… అయితే, ఈ వ్యవహారంలో హైకోర్టును ఆశ్రయించారు ఎంపీ రఘురామకృష్ణంరాజు తరపు న్యాయవాదులు.. దీనిపై స్పందించిన హైకోర్టు.. జిల్లా కోర్టు వెళ్లకుండా నేరుగా హైకోర్టుకు ఎందుకు వచ్చారని ప్రశ్నించింది హైకోర్టు.. అయితే, ప్రాథమిక విచారణ, ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని హైకోర్టుకు విన్నవించారు రఘురామకృష్ణంరాజు న్యాయవాది.. ఎంపీ హోదాలో ఉన్న వ్యకిని సహేతుక కారణాలు…
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశాడంటూ ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాదులోని ఆయన నివాసంలో అరెస్ట్ చేయడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే పార్టీలకు అతీతంగా రఘురామకృష్ణరాజు అరెస్ట్ ను తప్పుబడుతున్నారు. తాజాగా బీజేపీ మహిళా నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి ఎంపీ రఘురామకృష్ణరాజు ను అరెస్టును ఖండించారు. ప్రతిష్ఠకు భంగం కలిగేలా మాత్రమే కాదు, న్యాయవ్యవస్థను అవమానించేలా మాట్లాడిన అదే పార్టీకి చెందిన నేతలను…
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఏపీ సీఐడీ అధికారుల బృందం హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్‌హిల్స్‌లో ఉన్న రఘురామకృష్ణరాజు నివాసానికి చేరుకుని ఆయనను అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత గుంటూరు సీఐడీ కార్యాలయానికి ఎంపీ రఘరామకృష్ణరాజును తరలించారు. ఆయన వస్తున్న సమయంలో గుంటూరు సీఐడీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు, భారీ గేట్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ…
ఇటీవలి కాలంలో ఏపిలో టిడిపి నేత అరెస్టు,కేసు చూస్తున్న వారికి ఎంపి రఘురామకృష్ణం రాజు అరెస్టు అట్టే ఆశ్చర్యం కలిగించదు. కాకపోతే వారు ప్రత్యర్థి పార్టీకి చెందిన వారు కాగా ఈయన పాటక వైసీపీ టికెట్ పైనే ఎంపికైన ఎంపి. కారణాలేమైనా చాలా కాలంగా ఆయన అధినేతతో విభేదించి వివాదగ్రస్తమైన వ్యాఖ్యలు కొససాగిస్తున్నారు. దీనిపై ఆయనను అనర్హుడిగా ప్రకటించాని వైసీపీ పార్లమెంటరీ పార్టీ లోక్‌సభ స్పీకర్‌ను కోరింది. అయితే తాము పార్టీ పక్షాన చర్యలు తీసుకోవడానికి మాత్రం…