రఘురామకృష్ణంరాజు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది… నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుకు బెయిలు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. కులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ శుక్రవారం హైదరాబాద్ లో ఏపీ సీఐడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే కాగా… బెయిల్ కోసం రఘురామకృష్ణం రాజు పెట్టుకున్న హౌస్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే, ఆయన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేయడంతో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది.. విచారణ ప్రారంభమైన వెంటనే సీఐడీ జిల్లా కోర్టుకు కాకుండా నేరుగా ఎందుకొచ్చారంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు. ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తిని సరైన కారణాలు లేకుండా అరెస్టు చేసి రిమాండుకు పంపాలని పిటిషనర్ తరపు న్యాయవాది తెలియజేశారు. ప్రాథమిక విచారణగాని, కనీస ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని రాజు తరఫు లాయర్ వాదించారు. అయితే, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టి ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, అందుకే అరెస్టు తప్పలేదని ప్రభుత్వం వాదనలు వినిపించింది… దీంతో.. ఆయన బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన హైకోర్టు.. సెషన్ కోర్టులోనే పిటిషన్ వేసుకోవాలని ఈ సందర్భంగా ఆదేశించింది. బెయిల్ కావాలంటే కింది కోర్టును ఆశ్రయించాలన్న హైకోర్టు… ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కేసులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీంతో.. సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు రఘురామకృష్ణంరాజు న్యాయవాదులు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.
Also Read
తాజావార్తలు
-
Astrology: సెప్టెంబర్ 25 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..?
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!