ఇటీవలి కాలంలో ఏపిలో టిడిపి నేత అరెస్టు,కేసు చూస్తున్న వారికి ఎంపి రఘురామకృష్ణం రాజు అరెస్టు అట్టే ఆశ్చర్యం కలిగించదు. కాకపోతే వారు ప్రత్యర్థి పార్టీకి చెందిన వారు కాగా ఈయన పాటక వైసీపీ టికెట్ పైనే ఎంపికైన ఎంపి. కారణాలేమైనా చాలా కాలంగా ఆయన అధినేతతో విభేదించి వివాదగ్రస్తమైన వ్యాఖ్యలు కొససాగిస్తున్నారు. దీనిపై ఆయనను అనర్హుడిగా ప్రకటించాని వైసీపీ పార్లమెంటరీ పార్టీ లోక్‌సభ స్పీకర్‌ను కోరింది. అయితే తాము పార్టీ పక్షాన చర్యలు తీసుకోవడానికి మాత్రం సిద్ధం కాలేదు. ఒకవేళ తామే వేటు వేస్తే ఆయనకు ఫిరాయింపు చట్టం నిబంధనలు వర్తించవనేది వారు చేసే వాదన,అయితే ఇటు ఎంపికీ అటు పార్టీకి మధ్యన దూరం పెరుగుతూ వచ్చిందే గాని తగ్గింది లేదు. ఈ క్రమంలో ఆయన ప్రభుత్వ విధానాలో లోపాలను విమర్శించడంతో పాటు విపరీతమైన వ్యాఖ్యలు కూడా చేస్తూ వచ్చారనేది వాస్తవం. ప్రభుత్వంపైనే గాక ముఖ్యమంత్రి జగన్‌ను లాంఛనంగానో వ్యంగ్యంగానో ప్రియతమ నాయకుడని చెబుతూనే ఆయన సన్నిహితలు సహాదారులపై వ్యక్తిగతదాడి చేస్తూ వచ్చారు. చాలాసార్లు ఆ వ్యాఖ్యలో కులాలు మతాల ప్రస్తావన కూడా రావడం కద్దు, రోజు సోసల్ మీడియాలో ఆయన చేసే వ్యాఖ్యలు వాటిని కొన్ని ఛానళ్లు వెంటనే ప్రసారం చేయడం, గంటలతరబడి ఇంటర్వ్యూలు ఇదంతా ఒక ప్రహసనంగా తయారైంది, తన ప్రాణాలకు ముప్పు వుందని ఆయన ఫిర్యాదు చేయడంతో కేంద్రం వై క్యాటగరీ భద్రత కల్పించింది. అయితే బిజెపికి దగ్గర చేసుకోవాలనే ఉత్సాహం చూపించలేదు. పైగా బ్యాంకు అప్పు వ్యాపార వ్యవహారాలో ఆయనపై సిబిఐ దాడులు కూడా జరిగాయి.
పార్టీ పరంగా చర్యలు తీసుకోకపోయినా వైసీపీ మంత్రలు ఎంఎల్‌ఎలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయనపై పోలీసుకు ఫిర్యాదు చేశారు. ఎప్పుడు నర్సాపురం వచ్చినా అరెస్టు చేస్తారనే వాతావరణంలో ఆయన 2021 మార్చిలో హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసులో అరెస్టు చేయొద్దంటూ కోర్టు నాలుగు వారాల గడువు ఇచ్చింది. ఈ లోగా రఘురామకృష్ణం రాజు సిబిఐ న్యాయస్థానంలో జగన్ బెయిల్ రద్దుచేయాంటూ కేసు వేశారు. సాంకేతికంగా స్పష్టత తీసుకున్న మీదట కోర్టు దానిపై విచారణ ప్రారంభించింది. జగన్‌కు సిబిఐకి నోటీసు ఇచ్చింది. 17వ తేదీన ఆ కేసు విచారణకు రావలసివుంది. ఈ కేసు కారణంగా చాలాకాలం తర్వాత సిబిఐ కేసు చర్చలోకి వచ్చాయి. తాజాగా ఒక మహిళ సోషల్ మీడియాలో ఎంపిపై అసభ్యకరంగా మాట్లాడటం, ఆయన కూడా తగ్గకుండా తనదైన శైలిలో సమాధానమివ్వడంతో ఈ వివాదం కొంత జుగుప్సాకరమైన మలుపులు తీసుకుంది.
ఈపూర్వరంగంలో ఎపి సిఐడి పోలీసులు శుక్రవారం నాడు ఆయనను హైదరాబాదులో ఉద్రిక్తతల మధ్య అరెస్టు చేసి గుంటూరు తీసుకెళ్లడం కలకలం రేపింది. 30 మంది పోలీసులు హఠాత్తుగా వచ్చి పడ్డారనీ, వారు యూనిఫాంలో లేరు గనక ఎవరో చెప్పలేమని ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు. 124(ఎ) ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించడం, 153(ఎ) భిన్న వర్గాలు మధ్య విద్వేషం పెంచే వ్యాఖ్యలు, ఐపిసి505 బెదిరింపు చర్యలు, 123 కుట్రపూరిత చర్యలు అన్న సెక్షన్ల కింద ఆయనను అరెస్టు చేసినట్టు నోటీసు ఇచ్చారు, ఏ నోటీసు లేకుండా అరెస్టు చేశారని కుటుంబ సభ్యు చెబుతుంటే వారు నోటీసు తీసుకోవడానికి నిరాకరించారని సిఐడి వారు రాశారు. తర్వాత దీనిపై అధికారిక నోట్ విడుదలచేశారు. ఎపిసిఐడి ఎడిజి సునీల్‌కుమార్‌కు ఎంపి రఘురామపై ఫిర్యాదు అందగా ఆయన ప్రాథమిక విచారణ జరిపారని అందులో పేర్కొన్నారు. పైన పేర్కొన్న సెక్షన్లు వర్తించే విధంగా ఆయన నిరంతరం సోషల్‌మీడియా ద్వారా వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వంపై విశ్వాసం దెబ్బతినేలా, సామాజిక వైషమ్యాలు పెరిగేలా కొన్ని ఛానళ్లతో కలసి కుట్రపూరితంగా విద్వేష ప్రచారం చేస్తున్నారని అందులో ఆరోపించారు.కోవిడ్‌ను ఎదుర్కొవడంలో వైఫల్యాన్ని విమర్శిస్తే కక్ష సాధింపులతో అరెస్టుచేశారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఎంపిలు ఎంఎల్‌ఎలు చట్టసభ సభ్యులుగా చేసిన ప్రసంగాలు చర్యకు రక్షణ వుంటుంది గాని నేరపూరిత అభియోగాలు వచ్చినపుడు అరెస్టు నుంచి రక్షణ వుండదు. పైగా ఇక్కడ నాన్ బెయిబుల్ సెక్షన్లపై అరెస్టు చేశారు. రాజద్రోహం124(ఎ)ను ఉపయోగించడంపై ఇటీవలే సుప్రీం కోర్టు చర్చ లేవనెత్తింది గాని మిగిలిన సెక్షన్లు ఆ కోవలోకి వచ్చేవి కావు. అయితే ఈ అరెస్టుపై ఎంపి హైకోర్టులో హౌస్ మోషన్ వేస్తే ఉపశమనం లభిస్తుందా అనేది చూడాలి, గతంలోనే కోర్టు ముందు ఆయన కేసులు వుండటం, జగన్‌పై కేసు వేశాను గనక కక్ష సాధింపుతో అరెస్టు చేశారని వాదించే అవకాశం కూడా వుంటుంది. ఇవన్నీ ఏ మేరకు ఎలా జరిగేది ఆచరణలో చూడాలి,