విజయనగరం.. విశాఖ జిల్లాలను కలుపుతూ ఉన్న నియోజకవర్గం శృంగవరపుకోట. ఇక్కడ వైసీపీలో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీగా వార్ నడుస్తోంది. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ వర్గీయుడైన రఘురాజును వెంటపెట్టుకుని తిరిగేవారు. ఇద్దరూ పాలునీళ్లు అన్నంతగా కలిసి కనిపించేవారు. రఘురాజు లేకుండా సీసీరోడ్డును కూడా ప్రారంభించేవారు కాదు ఎమ్మెల్యే. సమావేశాలకు వెళ్లితే రఘురాజు ఎక్కడా అని ఆరా తీసేవారు. చివరకు రాజుగారి అనుగ్రహం లేకపోతే ఎమ్మెల్యే దగ్గర పని జరగదనే ప్రచారం ఉండేది. అలాంటిది…