RajiniKanth: ప్రపంచాన్ని నడిపించేది డబ్బు.. అది లేనిదే గౌరవం ఉండదు, మర్యాద ఉండదు, పేరు ప్రఖ్యాతలు రావు అని అంటూ ఉంటారు. కానీ, అందులో నిజం లేదని అంటున్నాడు సూపర్ స్టార్ రజినీ కాంత్.. ఎంత డబ్బు ఉండి ఏం ప్రయోజనం ప్రశాంతత లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు నూరవ చిత్రం ఏది? అనగానే ‘గంగోత్రి’ అంటూ చప్పున సమాధానం చెప్పేస్తారు. నిజానికి దర్శకేంద్రుని వందో సినిమాగా తెరకెక్కాల్సింది వేరే ఉందట! తన నూరవ చిత్రం చరిత్రలో తరిగిపోని, చెరిగిపోని రికార్డులు నెలకొల్పాలని ఓ భారీ మల్టీస్టారర్ తీయాలని ఆయన ఆశించారు. అప్పటికే ‘నరసింహనాయుడు, ఇంద్ర’ వంటి బ్లాక్ బస్టర్స్ కు కథను సమకూర్చిన చిన్నికృష్ణను పిలిపించి రాఘవేంద్రరావు ఓ మల్టీస్టారర్ తయారు చేయమన్నారట! అందులో చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ ఉండేలా కథ రూపొందించారు.…