RajiniKanth: నా జీవితంలో డబ్బు ఉంది కానీ ప్రశాంతత లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన తలైవా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RajiniKanth: ప్రపంచాన్ని నడిపించేది డబ్బు.. అది లేనిదే గౌరవం ఉండదు, మర్యాద ఉండదు, పేరు ప్రఖ్యాతలు రావు అని అంటూ ఉంటారు. కానీ, అందులో నిజం లేదని అంటున్నాడు సూపర్ స్టార్ రజినీ కాంత్.. ఎంత డబ్బు ఉండి ఏం ప్రయోజనం ప్రశాంతత లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా ఎవ్వరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బస్సు కండెక్టర్ గా మొదలైన రజినీ ప్రయాణం సూపర్ స్టార్ వరకు వచ్చిన వైనం అందరికీ తెల్సిందే. అయితేపేరు, డబ్బు తన మనసుకు ప్రశాంతతనే ఇవ్వలేదని చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. రజినీ నేడు చెన్నైలో హ్యాపీ సక్సెస్‌ఫుల్ లైఫ్ త్రూ క్రియ యోగ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నాడు.
ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “నేను మంచి నటుడని అందరు అంటూ ఉంటారు. కానీ, దాన్ని ప్రశంసగా తీసుకోవాలో, విమర్శగా పరిగణించాలో తెలియడం లేదు. నా సినిమాల్లో నాకు ఆత్మ సంతృప్తిని కలిగించిన సినిమాలు బాబా, మంత్రాలయం రాఘవేంద్ర స్వామి.. ఈ సినిమాలు చూసి నా అభిమానులు చాలా మంది సన్యాసులుగా మారారు, హిమాలయాలకు వెళ్లారు. కానీ నేను మాత్రం ఇక్కడే కొనసాగుతున్నాను. మధ్యలో వెళ్లి వస్తున్నా.. ఇంకా ఏదో చేయాలనిపిస్తూ ఉంటుంది. ఇక అక్కడ దొరికే అమూల్యమైన మూలికలు.. తింటే వారానికి సరిపడా శక్తి వస్తుంది. ఆరోగ్యం చాలా ముఖ్యం.. ఎందుకంటే మనల్ని ప్రేమించేవారు మనకు ఏదైనా అయితే తట్టుకోలేరు. డబ్బు, పేరు, ప్రఖ్యాతలు ఇవేమి నాకు సంతోషాన్ని ఇవ్వడం లేదు. అన్నీ ఉన్నా ప్రశాంతత లేదు నాకు. నా జీవితంలో నేను చాలా చూశాను.. కానీ, 10 శాతం కూడా ప్రశాంతంగా జీవించలేక పోయాను. సంతోషం, ప్రశాంతత అనేవి జీవితాంతం వుండేవి కావు” అంటూ చెప్పుకొచ్చాడు. తలైవా ఇలా వైరాగ్యంతో మాట్లాడడం అభిమానులను భయాందోళనకు గురిచేస్తోంది. ఇకపోతే ప్రస్తుతం రజినీ, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.
Also Read
తాజావార్తలు
-
CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
-
Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
-
Meta Smart Glasses: సరికొత్త టెక్నాలజీ ఫీచర్.. గాలిలో వేళ్లు ఊపితే చాలు వాట్సాప్‌లో మెసేజ్ పంపొచ్చు!
-
Virat Kohli: “జట్టుకు పనికొస్తానో లేదో నా ముఖం మీద చెప్పేయండి”.. గంభీర్, అగార్కర్‌పై కోహ్లీ ఫైర్..
-
UIDAI New Aadhaar App: mAadhaar యాప్ త్వరలో నిలిపివేత.. కొత్త Aadhaar యాప్‌కు డేటా ఎలా బదిలీ చేయాలి? పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..