సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ఇండస్ట్రీ హిట్ సినిమాల్లో చంద్రముఖికి స్పెషల్ ప్లేస్ ఉంది. ఈ సినిమాతో రజినీకాంత్ కొట్టిన హిట్ రీసౌండ్ చాలా కాలమే వినిపించింది. ఒక సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరో హారర్ సినిమా చేయడానికి ఆలోచిస్తాడు అలాంటిది జ్యోతికని హీరోయిన్ గా పెట్టి, ఆమె క్యారెక్టర్ పేరునే చంద్రముఖి సినిమా పేరుగా పెట్టి రజినీకాంత్ చంద్రముఖి మూవీ చేసాడు. పీ వాసు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రజినీకాంత్ వేంకటపతి రాజా…