హైదరాబాద్ లో డ్రగ్స్ వ్యవహారం చినికిచినికి గాలివానగా మారుతోందా? డ్రగ్స్ తీసుకున్నవారికి నోటీసులు జారీ కానున్నాయా? అంటే అవునంటున్నారు పోలీసులు. పుడింగ్ అండ్ మింక్ పబ్ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతోంది. బంజారా హిల్స్ లోని పబ్ లో పట్టుబడిన వారిలో కొందరు డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఆధారాలు లభించాయి. 20 మందికి డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా లభ్యమైన ఆధారాలతో దర్యాప్తులో ముందడుగు పడిందంటున్నారు. డ్రగ్స్ తీసుకున్న 20 మందికి నోటీసులు ఇచ్చే పనిలో పడ్డారు పోలీసులు. డ్రగ్స్ తీసుకున్న…
హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాడిసన్ హెటల్‌లోని పుడింగ్ అండ్ మింక్ పబ్‌లో శనివారం రాత్రి డ్రగ్స్ దొరికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ర్యాడిసన్ హోటల్ లైసెన్స్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. అంతేకాకుండా పుడింగ్ అండ్ మింక్ పబ్ లైసెన్స్‌ను, లిక్కర్ లైసెన్సును కూడా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బంజారా హిల్స్ పరిధిలో ఏళ్ల తరబడి రాడిసన్ హోటల్ కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ హోటల్‌కు…
హైదరాబాద్ బంజారాహిల్స్ ఫుడింగ్ అండ్ మింక్ పబ్ కేసుపై పోలీసులు ప్రత్యేకంగా విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. గత రెండు నెలలుగా డ్రగ్స్ విషయంలో అనేక కేసులు నమోదు చేశామని.. పబ్స్‌పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి డెకాయ్ ఆపరేషన్ చేస్తున్నట్లు తెలిపారు. ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌లను కలిగి ఉన్న అన్నింటికీ మెసేజ్‌లు ఇచ్చామన్నారు. గత రాత్రి పబ్‌లో రాడిసన్ గ్రూప్ వారు అనుమతి తీసుకుని…
శనివారం అర్ధరాత్రి జరిగిన హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ పబ్ ఘటనపై ప్రముఖ నటుడు నాగబాబు స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. అందులో తన కుమార్తె నిహారిక పబ్‌లోనే ఉన్నట్లు స్పష్టంగా చెప్పారు. ఓ వైపు పోలీసుల విచారణ జరుగుతుండగా.. పబ్‌లో జరిగిన పార్టీలో డ్రగ్స్ విరివిగా వాడారన్నది స్పష్టం అయిన నేపథ్యంలో నిహారిక ఆ పార్టీలో ఉండటానికి కారణం చెప్పకుండా పోలీసులు నిహారిక తప్పులేదని చెప్పారంటూ నాగబాబు చెప్పడం వివాదాస్పదం అవుతోంది. నిహారిక గురించి ‘షీ…