ఇటీవలి కాలంలో ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాల్లో “రాధే శ్యామ్” ఒకటి. చాలా కాలం నిరీక్షణ తరువాత ఎట్టకేలకు ఈరోజు విడుదలైన ఈ మూవీకి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభిస్తోంది. అయితే ఈ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణం రాజు కూడా కీలకపాత్రలో నటించిన విషయం తెలిసిందే. “రాధేశ్యామ్”లో కృష్ణంరాజు పరమహంస అనే పాత్రను పోషించారు. ప్రభాస్, కృష్ణంరాజు కాంబోలో వచ్చిన మూడవ చిత్రం “రాధేశ్యామ్”. ఇంతకుముందు వీరిద్దరూ రెబల్, బిల్లా చిత్రాల్లో స్క్రీన్ ను…
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్” ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా కాలం నిరీక్షణ తర్వాత ఈ రోజు అంటే మార్చి 11న థియేటర్లలోకి ప్రభాస్ సినిమా రావడంతో అభిమానుల సంతోషానికి అంతులేకుండా పోయింది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే తాజాగా 100 టికెట్లు కావాలంటూ విజయవాడ మేయర్ రిక్వెస్ట్ చేస్తూ మల్టీప్లెక్స్ యజమానికి రాసిన లేఖ ఇప్పుడు…
దేశవ్యాప్తంగా “రాధేశ్యామ్” సందడి మొదలైంది. ఏ థియేటర్ వద్ద చూసినా ప్రభాస్ అభిమానుల రచ్చ కన్పిస్తోంది. స్లోగా సాగే లవ్ స్టోరీ అని రివ్యూలు వచ్చినప్పటికీ అభిమానుల హంగామా మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక తెలంగాణాలో ఇప్పటికే బెనిఫిట్ షోలు వేయగా, ఆంధ్రాలో మాత్రం బెనిఫిట్ షోలకు అనుమతి లభించలేదు. కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన కొత్త జీవో ప్రకారం ‘రాధే శ్యామ్’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలకు టికెట్ ధరలను 10 రోజుల…
ఈరోజు ఉదయం నుంచే థియేటర్లలో “రాధేశ్యామ్” సందడి నెలకొంది. అయితే సినిమా ప్రమోషన్లలో రాజమౌళి కూడా పాలుపంచుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం సినిమా విడుదల ఉండగా, గురువారం రోజు సాయంత్రం ‘రాధేశ్యామ్’ సినిమా గురించి రాజమౌళి, ప్రభాస్ మధ్య జరిగిన ఆసక్తికర చిట్ చాట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ జ్యోతిష్య అనుభవం, మగధీర, రాజమౌళి పాఠాలు, రాధే శ్యామ్ బడ్జెట్‌లు, యువి క్రియేషన్స్, రాధా కృష్ణ కుమార్ గురించి ప్రభాస్ మాట్లాడాడు.…