ఈరోజు ఉదయం నుంచే థియేటర్లలో “రాధేశ్యామ్” సందడి నెలకొంది. అయితే సినిమా ప్రమోషన్లలో రాజమౌళి కూడా పాలుపంచుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం సినిమా విడుదల ఉండగా, గురువారం రోజు సాయంత్రం ‘రాధేశ్యామ్’ సినిమా గురించి రాజమౌళి, ప్రభాస్ మధ్య జరిగిన ఆసక్తికర చిట్ చాట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ జ్యోతిష్య అనుభవం, మగధీర, రాజమౌళి పాఠాలు, రాధే శ్యామ్ బడ్జెట్‌లు, యువి క్రియేషన్స్, రాధా కృష్ణ కుమార్ గురించి ప్రభాస్ మాట్లాడాడు. ఇందులో భాగంగానే జ్యోతిష్యాన్ని నమ్ముతావా? అని రాజమౌళి ప్రశ్నించగా, ప్రభాస్ స్పందిస్తూ “మా గురువు గారు నమ్మరు. నేనూ నమ్మను” అంటూ రాజమౌళి కూడా జాతకాలను నమ్మరు అనే విషయాన్ని వెల్లడించారు.
Read also : Samantha Pics : హద్దులు దాటేస్తున్న సామ్… గ్లామర్ ఓవర్ డోస్
అయితే కంగనా విషయంలో మాత్రం అది నిజమైంది. “ఏక్ నిరంజన్” సినిమా చేస్తున్నప్పుడు కంగనా ఒక ఇంటరెస్టింగ్ విషయం చెప్పింది. కేరళకు వెళ్ళినప్పుడు తాళపత్ర గ్రంథాలను చూసి ఆమె హీరోయిన్ అవుతుందని చెప్పారట. ఆ సమయంలో ఆమె నేనేదో విలేజ్ నుంచి వచ్చాను. ఇలా చెప్తున్నారని అనుకుందట. కానీ ఆమె హీరోయిన్ అయ్యింది. ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలానే విన్నాము మనము అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చారు.