ఇటీవలి కాలంలో ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాల్లో “రాధే శ్యామ్” ఒకటి. చాలా కాలం నిరీక్షణ తరువాత ఎట్టకేలకు ఈరోజు విడుదలైన ఈ మూవీకి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభిస్తోంది. అయితే ఈ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణం రాజు కూడా కీలకపాత్రలో నటించిన విషయం తెలిసిందే. “రాధేశ్యామ్”లో కృష్ణంరాజు పరమహంస అనే పాత్రను పోషించారు. ప్రభాస్, కృష్ణంరాజు కాంబోలో వచ్చిన మూడవ చిత్రం “రాధేశ్యామ్”. ఇంతకుముందు వీరిద్దరూ రెబల్, బిల్లా చిత్రాల్లో స్క్రీన్ ను షేర్ చేసుకున్నారు. అయితే ఆశ్చర్యకరమైన తాజా వార్త ఏమిటంటే కృష్ణంరాజు ఈ చిత్రం తెలుగు వెర్షన్‌కు మాత్రమే పరిమితమయ్యారు. “రాధేశ్యామ్” విదేశీ థియేటర్లలో కృష్ణంరాజు కన్పించట్లేదట. దీంతో కృష్ణంరాజు ఎందుకు మిస్ అయ్యారంటూ అభిమానులు మేకర్స్ ను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.
Read Also : Radheshyam : 100 టికెట్లు కావాలంటూ విజయవాడ మేయర్ రిక్వెస్ట్… లెటర్ వైరల్
కృష్ణం రాజు పాత్రను హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో కోలీవుడ్ నటుడు సత్యరాజ్ పోషించారు. ట్రైలర్ రిలీజైనప్పటి నుంచి ఈ విషయం స్పష్టమైంది. కానీ ఈ చిత్రం తెలుగు వెర్షన్ లో కూడా కృష్ణంరాజు బదులు సత్యరాజ్ కనిపించినట్లు యూఎస్ఏ ప్రేక్షకులు వెల్లడించారు. ఒకే భాష కోసం మేకర్స్ రెండు వేర్వేరు వెర్షన్లను రూపొందించారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారంతా. ట్రైలర్ ను ముందుగా రిలీజ్ చేసినప్పుడు కూడా కృష్ణంరాజు పాత్రలో సత్యరాజ్ కనిపించడంతో దానిని డిలీట్ చేసి, కొత్త ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. నిజానికి కృష్ణం రాజు ఈ చిత్రంలో నటించడమే కాకుండా తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పారు. మరి అలాంటప్పుడు యూఎస్ ప్రింట్‌లో తెలుగు వెర్షన్‌లో కృష్ణం రాజుకి బదులుగా సత్యరాజ్‌ని ఎందుకు చూపించారనే దానిపై ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ లేదు. ఇక యూకేకి పంపిన కొన్ని ప్రింట్లలో కృష్ణంరాజు పాత్రను మొత్తానికే తీసేసినట్లు టాక్.