ప్రభుత్వ ఉద్యోగి అనుమానాస్పద మృతి ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. నాలుగు అడుగుల నీటి సంపులో మృతదేహం లభ్యమైంది. స్థానికులు, బంధువులు కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
హైదరాబాద్‌లోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో మరో డ్రగ్ ముఠా గుట్టురట్టు అయింది. నగరంలో కన్జ్యూమర్లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు పెడ్లర్లను బాలాపూర్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి డ్రై గంజాతో పాటు మొదటిసారిగా ఓషియన్ గంజా పట్టుబడింది.
హైదరాబాద్ మహానగరంలో డ్రగ్స్, గంజాయిని నిర్మూలించేందుకు పోలీసు శాఖ చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే నగరంలో ప్రధాన కూడళ్లు, చెక్‌పోస్టులు, పబ్బులు, క్లబ్బుల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. నిత్యం నగరంలోని ఏదో ఒక చోట డ్రగ్స్, గంజాయి పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో గురువారం భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో 510 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ఫెడ్లర్లను అరెస్టు చేశారు. ఒడిస్సా నుండి హర్యానాకు గంజాయిని తరలిస్తుండగా ఎస్ఓటీ పోలీసులు ఆ ముఠాను పట్టుకున్నారు. గంజాయి రవాణాకు ట్రాన్స్‌పోర్ట్ ఆటలో సీక్రెట్ పార్టీషన్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో.. ఒడిస్సా నుండి హైదరాబాద్ మీదుగా హర్యానాకు తీసుకెళ్తున్న ఇద్దరు పెడ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. మేడిపల్లి వద్ద వాహనం తనిఖీల్లో కోటి ఇరువై ఎనిమిది లక్షల విలువైన 510 కిలోల గంజాయిని…
Rangareddy : రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మదర్స్ డే నాడే అభం శుభం తెలియని పిల్లల ప్రాణాలు తీసి అమ్మ అనే పదానికి అర్థాన్నే మార్చిందో కఠినాత్మురాలు. భర్త, అత్తతో జరిగిన గొడవతో విచక్షణ కోల్పోయి తన ఇద్దరు కన్నకొడుకులను హతమార్చింది. ఈ దారుణానికి ఆ కన్న పేగు ఎలా ఒప్పుకుందో ఆలోచిస్తేనే కంట కన్నీరు ఆగడం లేదు.
15 ఏళ్లనాటి పగ.. దానిని అందరూ మర్చిపోయారు.. కానీ కొడుకు మాత్రం మర్చిపోలేదు.. తండ్రిని చంపిన హంతకులను ఎలాగానే చంపాలని ప్లాన్ చేశాడు. ఇందుకోసం బాగా కష్టపడి రియల్ ఎస్టేట్ వ్యాపారిగా అవతరించాడు. కోట్ల కొద్ది డబ్బులు సంపాదించాడు. తన తండ్రిని మట్టు పెట్టిన హంతకుల కోసం గాలించాడు. చివరికి హంతకులు దొరికారు. అయితే తాను హత్య చేయకుండా మరొకరి చేత హత్య చేయించాడు. రూ. 30 లక్షలను సుఫారీ గ్యాంగ్ ఇచ్చాడు. కర్ణాటక సుపారీ గ్యాంగ్…
హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధి కర్ణంగూడ దగ్గర జరిగిన కాల్పులు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో రియల్టర్ ఆస్పత్రిలో రాఘవేందర్ రెడ్డి చికిత్స అందుకుంటూ మరణించాడు. ఈ కాల్పుల కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలపై గతం లో పలు మార్లు రాచకొండ పోలీసులకు ఫిర్యాదులు చేశారు. తమ భూమిని కబ్జా చేస్తున్నారని రాచకొండ పోలిసులను కలిశారు లేక్…
హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధి కర్ణంగూడ దగ్గర కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి… ఈ ఘటనలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో రియల్టర్ పరిస్థితి విషమంగా ఉంది… ఈ ఘటనకు భూ వివాదమే కారణంగా చెబుతున్నారు.. ఇటీవలే 10 ఎకరాల భూమిని ఇంద్రారెడ్డి అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేశారు శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి అనే ఇద్దరు రియల్టర్లు.. అయితే, అప్పటికే ఆ భూమిపై కబ్జాలో ఉన్నాడు మట్టారెడ్డి అనే వ్యక్తి..…
రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ణంగూడలో కాల్పుల కలకలం సృష్టిస్తున్నాయి.. కర్ణంగూడ గ్రామ సమీపంలో ఓ రియాల్టర్ గాయాలపాలయ్యాడరు.. తనపై ఎవరో తుపాకీతో కాల్పులు జరిపారని స్థానికులకు తెలిపాడు రియాల్టర్.. ఇక, స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.. ఘటనా స్థలంలో ఉన్న స్కార్పియోకు రక్తం మరకలు గుర్తించారు.. అయితే, దీనిపై భిన్నకథనాలున్నాయి.. కర్ణంగూడ గ్రామ సమీపంలో స్కార్పియో కారు అదుపుతప్పినట్టుగా కూడా చెబతున్నారు.. ఒకరికి తీవ్రగాయాలు…