Lalu Family Trouble: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి వరుస షాకులు తగులుతున్నాయి. ఓవైపు ఇంటి పోరుతో ఇబ్బంది పడుతున్న తరుణంలో.. ఇప్పుడు అధికారిక బంగ్లాలు ఖాళీ చేయాలనే కొత్తగా ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం ఆ ఫ్యామిలీకి తలనొప్పిగా మారింది.
Bihar: బీహార్ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత, నితీష్ కుమార్ నేతృత్వంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల తర్వాత, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భార్య, బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవికి షాక్ ఇచ్చింది.
Bihar Election Results: బీహర్ ఎన్నికల ఫలితాలు సంచలనంగా మారాయి. ఎగ్జిట్ పోల్స్ ఊహించిన దాని కన్నా ఎన్డీయే కూటమి అఖండ విజయం దిశగా వెళ్తోంది. మొత్తం 243 సీట్లలో బీజేపీ-జేడీయూ కూటమి 190కి పైగా స్థానాలను కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది.
Bihar Elections: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల కోసం నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ఇప్పటికే బీజేపీ, దాని మిత్రపక్షం జేడీయూలు తొలి విడత అభ్యర్థుల లిస్ట్‌లను విడుదల చేశాయి. పలువురు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. బుధవారం ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ రఘోపూర్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. మరోసారి ఈ స్థానం నుంచి గెలిచి, హ్యట్రిక్ సాధించాలని తేజస్వీ లక్ష్యంగా పెట్టుకున్నారు.
Bihar Elections: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే ఎన్డీయే, మహాఘటబంధన్ కూటములు సీట్ల షేరింగ్‌పై చర్చోపచర్చలు నిర్వహిస్తున్నాయి. ఇదిలా ఉంటే, మరోవైపు రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో వివాదం మరింత ముదురుతోంది.
Lalu Prasad Yadav: లాలూ ప్రసాద్ యాదవ్‌పై ఆయన బావమరిది, మాజీ రాజ్యసభ ఎంపీ సుభాష్ యాదవ్ గురువారం రోజు సంచలన ఆరోపణలు చేశారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్‌ని పాలిస్తున్న సమయంలో కిడ్నాప్‌లకు పాల్పడే ముఠాలతో సంబంధాలు కలిగి ఉన్నారని ఆరోపించారు. లాలూ భార్య రబ్రీదేవీకి సుభాష్ యాదవ్ సొంత తమ్ముడు.
JDU: ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆర్జేడీడీ నేత, లాలూ ప్రసాద్ భార్య రబ్రీ దేవి విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలపై జేడీయూ ఎంపీ లల్లన్ సింగ్ ఫైరయ్యారు. బడ్జెట్‌లో సామాన్యులకు ఏమీ లేదని, కేంద్రం బీహార్‌కి బొమ్మ(జుంఝానా) మాత్రమే ఇచ్చిందని ఆమె అన్నారు.
బీహార్‌లో శాసన మండలి ఎన్నికల్లో ఓటింగ్ జరగకుండానే మొత్తం 11 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శాసనమండలిలో 11 స్థానాలు ఖాళీ కాగా.. ఇందులో, ఎన్‌డీఏకు చెందిన ఆరుగురు అభ్యర్థులు, మహాకూటమికి చెందిన ఐదుగురు అభ్యర్థులు మినహా.. 12వ పోటీదారు ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. ఈ క్రమంలో అభ్యర్థులందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అగ్ర నేత రబ్రీదేవికి (Rabri Devi) శాసనమండలిలో ప్రమోషన్ దొరికింది. తాజాగా ఆమె బీహార్ శాసనమండలికి ఆర్జేడీ విపక్ష నేతగాఎన్నికయ్యారు.
ఉద్యోగాల భూ కుంభకోణం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి (Rabri Devi), ఆమె కుమార్తెలు మిసా భారతి, హేమా యాదవ్‌లు శుక్రవారం ఢిల్లీ రూస్ అవెన్యూ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.