‘రేబిస్’ బారిన పడి మరో యువకుడు మరణించాడు. ఇటీవల ఓ కబడ్డీ ప్లేయర్ కుక్క పిల్లను కాపాడుతుండగా.. అది చిన్నగా కొరికింది. చిన్న కుక్క పిల్లే కదా ఏమవుతుందిలే అని దానిని నిర్లక్ష్యం చేశాడు. దాదాపుగా మూడు నెలలు రేబిస్ వ్యాధితో బాధపడుతూ అతడు చనిపోయాడు. ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో నివసించే రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడాకారుడు బ్రిజేష్ (22) రేబిస్ వ్యాధితో ఇటీవల మరణించాడు. రెండు నెలల క్రితం డ్రెయిన్ నుంచి కుక్క పిల్లను రక్షిస్తున్నప్పుడు అతనికి కుక్క కరిచింది. కుక్క కాటు తర్వాత అతను యాంటీ-రేబిస్ వ్యాక్సిన్‌లు తీసుకోకపోవడంతోనే ఈ దురదృష్టకర సంఘటన జరిగింది.
ప్రస్తుతం ఇలాంటి ఘటనే ఒకటి డెహ్రడూన్‌లో చోటు చేసుకుంది. రేబిస్ లక్షణాలతో మరో యువకుడు మరణించాడు. కుక్క కరిచిన ఆరు నెలల తర్వాత ఆ యువకుడిలో రేబిస్ లక్షణాలు కనిపించాయి. ఆ యువకుడు నీరు, వెలుతురుని చూసి భయపడి.. లాలాజలం కార్చాడు. అంతేకాక అతడిలో తీవ్రమైన దూకుడు సంకేతాలు కూడా కన్పించాయని వైద్యులు తెలిపారు. రేబిస్ లక్షణాలతో ఉన్న యువకుడిని ఎయిమ్స్ కు తరలించారు. అక్కడ సరైన వైద్యం లభించకపోవడంతో అతడిని.. ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడే అతడు చనిపోయాడు.
తీవ్రవైన రేబిస్ లక్షణాలు ఉన్న ఆ యువకుడిని డూన్ ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. అక్కడ అతడిగా దాదాపుగా మూడు గంటలకు పైగా చికిత్స అందించారు డాక్టర్లు. తరువాత పరిస్థితి విషమించడంతో ఎయిమ్స్ రిషికేష్‌కు తరలించారు. అందుకే కుక్క కాటును ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు అంటున్నారు. పెంపుడు కుక్కలతో సైతం చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.